జస్టిస్ కె.వి.రవీంద్రన్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఈ వ్యాఖ్యానాలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు), ఢిల్లీ యూనివర్సిటీలలో జరిగే అడ్మిషన్లలో ఒ.బి.సి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం లేదన్న పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం బెంచి ఈ వ్యాఖ్యలు చేసింది.
“బ్యూరోక్రట్ అధికారుల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారి పిల్లలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను పొందగలుగుతున్నారు. బస్తర్ (ఛత్తీస్ ఘఢ్) లోని గిరిజనుల పిల్లలు ఎన్నడూ రిజర్వేషన్ ఫలాలను పొందలేక పోతున్నారు. వారికసలు అటువంటి అవకాశాలున్న సంగతి కూడా తెలియదు” అని జస్టిస్ పట్నాయక్ వ్యాఖ్యానించాడు. ఏ ప్రజల సామాజిక-ఆర్ధిక స్ధితిగతులను మెరుగుపరచడానికైతే రిజర్వేషన్లు ఉద్దేశించబడ్డాయో, వారికి రిజర్వేషన్ ఫలాలు ఎన్నటికీ చేరకపోవడం ఇక్కడ విషాధం. వారి కోసం ఉద్దేశించబడిన పధకాల సంగతి వారికి తెలియడంలేదు” అని ఆయన వ్యాఖ్యానించాడు.
“ఒక చేతితో (రిజర్వేషన్ సౌకర్యం) ఇస్తూ, మరొక చేత్తో దానిని తీసేసుకునే పరిస్ధితిని మనం అంగీకరించ జాలము” అని జస్టిస్ రవీంద్రన్ అన్నాడు. జె.ఎన్.యు తరపున హాజరయిన సీనియర్ కౌన్సెల్ కె.కె.వేణుగోపాల్ ఒ.బి.సి రిజర్వేషన్ల అమలులో యూనివర్సిటీ అనుసరిస్తున్న మూడంచెల విధానాన్ని వివరించడానికి ప్రయత్నించగా, జస్టిస్ రవీంద్రన్, “(ఒక నిర్ధిష్ట యూనివర్సిటీకి చెందిన) మినహాయింపులు, ప్రవేశ ప్రక్రియల గురించి మేము నిర్ణయించడం లేదు. చట్టబద్ధ సూత్రాలు, రాజ్యాంగ అవకాశాలపైన మాత్రమే నిర్ణయించగలం” అని తెలిపాడు.
విద్యార్ధుల కేంద్రీకరనను ఆకర్షించిన జె.ఎన్.యు, ఢిల్లీ యూనివర్సిటీ ల గురించి మాత్రమే వేణుగోపాల్ మాట్లాడుతున్నారని చెబుతూ సుప్రీం బెంచి ‘కాని మేము మొత్తం దేశం గురించి మాట్లాడుతున్నాము. మేమింకా పెద్ద అంశం గురించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంది” అని బెంచి సభ్యులు తెలిపారు. పిటిషనర్ పి.వి.ఇందిరేశన్ తరపున హాజరైన సీనియర్ కౌన్సెల్ ఎ.సుబ్బారావు, వేణుగోపాల్ వాదనకు ప్రతి వాదన చేస్తూ “పార్లమెంటు ఇస్తున్నదానిని అదే పార్లమెంటు భావిస్తున్నదాని (ఇంటర్‌ప్రెట్) ప్రకారం ఒ.బి.సి విద్యార్ధుల ప్రయోజనాలను తీసేసుకోవడానికి వీలు లేదు” అని అన్నాడు. జె.ఎన్.యు ఏదో కొత్త పద్ధతిలో ప్రవేశం మంజూరు చేస్తున్నదని ఆయన తెలిపాడు. –యాహూ న్యూస్ ద్వారా ఐ.ఎ.ఎన్.ఎస్ (ఇండియా అబ్రాడ్ న్యూస్ సర్వీస్).

Read my FB post: https://www.facebook.com/praveen.mandangi.1/posts/165136000304330
దిసంబర్ 21న నేను హైదరాబాద్‌లో idontwantdowry.com వారు నిర్వహించిన స్వయంవరం కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ అగ్రకులాల అమ్మాయిలలో ఎక్కువ మంది తమకి ఏ ఉద్యోగం ఉన్నవాడైనా ఫర్వాలేదని చెపితే దళితుల అమ్మాయిలలో ఎక్కువ మంది తమకి ప్రభుత్వ లేదా IT ఉద్యోగం ఉన్నవాళ్ళే కావాలన్నారు. రిజర్వేషన్ అనేది జనం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే పోటీ పడేలా చేస్తుందని దీన్ని బట్టి అర్థమవ్వడం లేదా?
అగ్రకులాలవాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏ ఉద్యోగం ఇచ్చినా తీసుకుంటారు. అగ్రకులాలవాళ్ళలో వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దళితుల విషయం అలా కాదు. ఒక దళితుణ్ణి B.A. చదివిస్తే అతను తనకి ప్రభుత్వ ఉద్యోగం తప్ప ఏదీ వద్దంటాడు, అలాగే B.A. చదివిన దళితుని కూతురు తాను ప్రభుత్వ ఉద్యోగిని తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోను అంటుంది. కొంత మంది దళితులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, మిగితా దళితుల్ని ఊరి చివర గుడిసెల్లో ఉంచితే, దాని వల్ల కుల వ్యవస్థ మాయమవ్వడం జరగదు. ఆడ పిల్లకి ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఆమెని ఉద్యోగస్తునికి ఇచ్చే పెళ్ళి చెయ్యాల్సి వస్తుందనీ, ఆమెకి ఉద్యోగస్తుడు దొరక్కపోతే తమకి సమస్య అవుతుందనీ, ఆడ పిల్ల పుట్టకముందే అబార్షన్ చెయ్యించుకునేవాళ్ళు కూడా ఉంటారు. రిజర్వేషన్ లాంటి పైపై సంస్కరణల వల్ల కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలలో ఏమాత్రం మార్పు రాదు.
ఉద్యోగం ఉన్నవాళ్ళందరూ ప్రతిభావంతులు కాదు. మా అమ్మగారు బ్యాంక్ ఉద్యోగానికి ఇంతర్వ్యూకి వెళ్ళినప్పుడు “ఇందిరా గాంధీ పుట్టిన రోజు ఏది?” అనే ప్రశ్న అడిగారు. బ్యాంక్ ఉద్యోగం చెయ్యడానికి గణితం, ఇంగ్లిష్ వస్తే సరిపోతుంది కానీ ఇందిరా గాంధీ బయోగ్రఫీకీ, బ్యాంక్ ఉద్యోగానికీ సంబంధం ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలన్నిటిలోనూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు.
అలాగే రిజర్వేషన్ విధానం వల్ల దళితుల జీవితాలు బాగుపడతాయని కూడా నేను అనుకోను.