కల్కా మెయిల్ పట్టాలు తప్పడంతో 35 మంది దుర్మరణం, 200 మందికి పైగా గాయాలు -‘ది హిందూ’ ఫోటోలు


భారత రైల్వేల కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హౌరా నుండి ఢిల్లీ వెళ్తున్న కల్కా మెయిల్ ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ వద్ద మధ్యాహ్నం గం.12:20 ని.లు సమయంలో పట్టాలు తప్పింది. మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పగా 10 బోగీల షేపులు మారిపోయాయి. సిగ్నల్స్, ఫిష్ ప్లేట్లు అన్ని బాగానే ఉన్నాయని ప్రాధమిక విచారణలో తేలింది. డ్రైవర్ తాగిలేడని రైల్వే అధికారులు నిర్ధారించారు. కారణం ఇంకా స్పష్టం కాలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. గత వారం రోజుల్లో ఉత్తర ప్రదేశ్ లోనే ఇది రెండవ రైలు ప్రమాదం. నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఎమ్.సి.జోషి కారణాల కోసం దర్యాప్తుకు ఆదేశించామని తెలిపాడు.

జులై 7న అధుర్ పూర్ వద్ద కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద మధుర-ఛాప్రా ఎక్స్‌ప్రెస్ ఒక పెళ్ళి బస్సుని ఢీ కొట్టడంతో 38 మంది చనిపోయారు. మళ్ళీ మూడు రోజులకే తాజా ప్రమాదం సంభవించింది. మృతుల్లో స్త్రీలు పిల్లలు ఉన్నారు. రెండు బోగిల్లోకి ఇంకా పోలీసులు, రెస్క్యూ వర్కర్లు వెళ్ళలేక పోయారని ఫతేపూర్ ఎస్.పి తెలిపాడు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. గ్యాస్ కట్టర్ లు ఉపయోగించి బోగిల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం భారిగా జరిగినట్లు కనపడుతోంది.

‘ది హిందూ’ పత్రిక ద్వారా పి.టి.ఐ వార్తా సంస్ధ అందించిన ఫోటోలు:

 

వ్యాఖ్యానించండి