రెండు రోజు తెలంగాణ బంద్ విజయవంతమైంది. ఒక్క సైబరాబాద్ మినహా తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ బంది సక్సెస్ అయింది. కేంద్రం మాత్రం తొందరపడడం లేదు. డిసెంబరు 9, 2009 నాటి ప్రకటన అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల రాజినామాలతో పాటు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉద్యమించడంతో కొద్ది రోజులకే ఆ ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఆ అనుభవం ఇంకా పీడకలగా కాంగ్రెస్‌ను వెన్నాడుతోంది. దానితో ఏ నిర్ణయమూ తీసుకోకుండా “ఏకాభిప్రాయం” అంటూ పిరికితనంగా నానుస్తోంది. ఏదో ఒకటి తేల్చేయండి మహా ప్రభో అని ఇరు ప్రాంతాలవారూ మొత్తుకుంటున్నా కేంద్రం వెనకాడుతోంది. ఈ నేపద్యంలో తెలంగాణ పొలిటికల్ జె.ఎ.సి ఇచ్చిన పిలుపు మేరకు 48 గంటల బంద్ విజయవంతమైందని ఉద్యమకారులు ప్రకటించారు. పి.టి.ఐ వార్తా సంస్ధ అందించిన బంద్ ఫోటోలు:
- పోలీసులు, విద్యార్దుల ఘర్షణలో చిక్కుకుని గాయపడ్డ విలేఖరిని ఆసుపత్రికి మోసుకెళ్తున్న దృశ్యం












తెలంగాణా వాదం అంటూ రోడ్లు పట్టుకు తిరుగుతూ విజ్ఞతను మరచి ప్రజల ఆస్తులను ద్వంసం చేస్తూ ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తూ ఉద్యమం పేరుతో ఆంధ్రప్రదేశ్ అబివృద్దిని కాకి లెక్కలు, కాకి కథలు చెబుతూ ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్ షిప్లు తీసుకుంటూ, భవిష్యత్ భాద్యత, చదువు మీద భక్తి లేక మీరు చేస్తున్న దానికి సమీప భవిష్యత్లో బాధపడక తప్పదు. ఇప్పటికైనా రాజకీయ నాయకుల మోసపు మాటలతో విజ్ఞత మరచి ప్రవర్తించాకండి. మీరు కోరుకున్నది జరిగితే పాలించేది ఈనాయకులే మీకు ఒరిగేది ఏమి ఉండదు. మొదటగా ఈసత్యాన్ని గ్రహించి ప్రాంతీయ అభివృద్దికి మాత్రమే ఉద్యమాలు చేయండి. విభజనకు కాదు. విభజన వలన మీకే గాక అన్ని ప్రాంతాల వారికీ నష్టం వాటిల్లుతుంది. సత్యం గ్రహించి మెలగండి.
కృతిగారూ, కారణం ఏమైనా వెనక్కి వెళ్ళలేని పరిస్ధితి నెలకొంది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు, పెట్టుబడిదారులు కూడ హైద్రాబాద్ లో తమకూ అవకాశం ఉంటే తెలంగాణకు ఓకే అని హైకమాండ్ కి చెబుతున్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఈ విభజన కేవలం రాష్ట్ర విభజన తప్ప దేశ విభజన కాదు. బెంగుళూరు కంపెనీల్లో తెలుగువాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వ రంగ కంపెనీల్లో కూడా. అలాంటిది హైద్రాబాదు కంపెనీల్లొ సీమాంధ్రులకు ప్రవేశం ఉంటుంది. ఇక పెట్టుబడుదారులు పెట్టుబడులు పెట్టాలే గానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. విదేశీ పెట్టుబడుల్నే బతిమాలి ఆహ్వానిస్తున్నపుడు సీమాంధ్ర వారిని ఎందుకు పొమ్మంటారు? తెలంగాణ ఏర్పాటు వలన సీమాంధ్ర పెట్టుబడిదారులకి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతాయన్న దాన్లో తప్ప మరిదేన్లోనూ నిజం లేదు. పైగా సీమాంధ్ర ప్రజలకు సమీపంలో రాజధాని ఏర్పడే అవకాశం వస్తుంది. కొత్త సచివాలయం, అసెంబ్లీ ఇవన్నీ మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తాయి. హైద్రాబాద్ అయితే కొంత భాగం ఉద్యోగాలే కానీ కొత్త రాష్ట్రంలో రాజధాని ఉద్యోగాలన్నీ మనవే. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెంది ఆ రంగంలో కూడా ఉద్యోగాలు వస్తాయి. హైద్రాబాద్ లో కేంద్రీకృతమైన అభివృద్ధి వికేంద్రీకృతమై ఇతర ప్రాంతాల అభివృద్ధికి కొత్త సీమాంధ్ర రాష్ట్రం ప్రయత్నిస్తుంది. ధనికుల లాభనష్టాలు అటుంచితే సీమాంధ్ర ప్రజలకు మాత్రం బోల్డన్ని లాభాలు. కాసింత నెమ్మదిగా ఆలోచించి చూడండి. తత్వం బోధపడుతుంది. అనవసరంగా తెలంగాణని తద్వారా కొత్త సిమాంధ్రనీ వద్దంటున్నానామేమో!