శనివారం వరకు ప్రపంచంలో అత్యంత తక్కువ ఎత్తు గల వ్యక్తి నేపాల్ దేశీయుడైన ఖగేంద్ర ధాపర్ మగర్ (26.3 అంగుళాలు) భావిస్తూ వచ్చాం. తాజాగా ఫిలిప్పైన్ దేశీయుడైన “జున్రే బలావింగ్” అతని రికార్డును బద్దలు చేసి గిన్నిస్ బుక్‌లో స్ధానం సంపాదించాడు. గత ఆదివారంతో 18 సంవత్సరాలు నిండిన జున్రే ఎత్తు 59.93 సెంటీ మీటర్లు (23.36 అంగుళాలు) గా నమోదయ్యింది. జున్రే ఇప్పుడు బ్రతికి ఉన్నవారిలో మాత్రమే పొట్టివాడు. 1997లో చనిపోయిన భారతీయుడు గుల్ మహమ్మద్ ( 22.5 అంగుళాలు) ఇప్పటివరకు అందరికంటె పొట్టివాడుగా రికార్డు సృష్టించాడు. రాయిటర్స్ ప్రచురించిన జున్రే ఫోటోలు చూద్దాం!







