చిలీలో పుయేహూ అగ్ని పర్వతం బద్దలై లావా బూడిదను ఎగజిమ్ముతున్న దృశ్యం -ఫోటో


Chiles_puyehue_volcano_spews_c

జూన్ 5, 2011 తేదీన చిలీ దేశంలోని “పుయేహూ” అగ్ని పర్వతం బద్దలయ్యింది. దాంతో అగ్ని పర్వతం చుట్టూ 70 కి.మీ పరిధిలో నివసిస్తున్న వారు ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. దక్షిణ చిలీలోని ఓసోర్నో పట్టణానికి సమీపంలో ఈ అగ్ని పర్వతం ఉంది. చిలీ రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 870 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్వతం గత యాభై సంవత్సరాల్లో బద్దలవడం ఇదే మొదటిసారి. పేలుడు ధాటికి బూడిద పక్కనే ఉన్న అర్జెంటీనాకీ విస్తరించింది. పర్వతం నుండి వెలువడిన బూడిదతో నిండిన వాయువులు పది కి.మీ ఎత్తుకు ఎగసిపడ్డాయి.

వ్యాఖ్యానించండి