నేను చూసిన ఆటగాళ్ళలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్ -వివ్ రిచర్డ్స్


Tendulkarవెస్ట్ ఇండీస్ కి చెందిన లెజెండరీ బ్యాట్స్ మెన్ వివ్ రిచర్డ్స్ సచిన్ అభిమానుల జాబితాలో చేరాడు. “నేను డాన్^ని చూడలేదు. కానీ నా దృష్టిలో నా క్రికెట్ కెరీర్ లో నేను చూసిన బ్యాట్స్ మేన్ లలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్. అతనికంటే గొప్ప బ్యాట్స్ మేన్ ను నేను చూడలేదు” అని తెలిపాడు. “సచిన్ కంటే గొప్ప బ్యాంట్స్ మేన్ ఎవరైనా ఉన్నట్లయితే అతనింకా రాలేదు” అని క్రికెట్ లెజండ్ వివ్ రిచర్డ్స్ తేల్చి చెప్పాడు. తన ఒక్క వ్యాఖ్యతో రిచర్డ్స్ తన సహ ఆటగాడు బ్రియాన్ లారా, ఇతర దేశాల ఆటగాళ్ళు రికీ పాంటిగ్, జాక్వెస్ కలీస్ లను పక్కకు నెట్టేసినట్లయింది. తన కాలంలో గొప్ప ఆటగాళ్ళుగా పేరొందిన జావేడ్ మియాందాద్, సునీల్ గవాస్కర్ లను కూడా రిచర్డ్స్ సచిన్ తర్వాతే నని రిచర్డ్స్ పరోక్షంగా తెలిపాడు.

బ్రాడ్ మేన్ 20 సంవత్సరాల పాటు క్రికెట్ కెరీర్ ను కొనసాగించాడు. రెండో ప్రపంచ యుద్ధం వలన కొన్ని సంవత్సరాలు ఆయన కెరీర్ కు బ్రేక్ వచ్చింది. టెండూల్కర్ ఇప్పటికే 22వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. బ్రాడ్ మేన్ 52 టెస్టుల్లో 29 సెంచరీలు చేశాడు. సచిన్ అన్నీ ఫార్మాట్లలో ఇప్పటికే 99 సెంచరీలు చేసి ఇంకా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. “టెండూల్కర్ కి సంబంధించి నాకు కనిపింకే గొప్ప విషయం తాను తన క్రికెటింగ్ కెరీర్ లో పూర్తి చక్రాన్ని చుట్టివచ్చాడు. బాధ, వేదన, వైఫల్యాలు, Viv Richardsగాయాలు, ఒత్తిడులు అన్నింటినీ ఎదుర్కొన్నాడు. అయినా ఆ చక్రం పూర్తయ్యే వరకూ కెరీర్ ని కొనసాగించాడు. అతను అత్యంత పూర్తి ప్యాకేజీ లాంటివాడు. ఇతరులందరికంటే నేను అధికంగా గౌరవించే గొప్ప క్రికెటర్” అని రిచర్డ్స్ సచిన్ ని కొనియాడాడు.

సచిన్ వెస్ట్ ఇండీస్ పర్యటనకు డుమ్మా కొట్టడాన్ని వివ్ సమర్ధించాడు. “అతనికి 37 ఏళ్ళు. యువకుడిగా అతనేమీ ఎదగబోవడం లేదు. అతని నిర్ణయాలను గౌరవించాలి” అని రిచర్డ్స్ పేర్కొన్నాడు. జానీవాకర్ ప్రమోషన్ ఈవెంటులో పాల్గొనడానికి క్వీన్స్ పార్కుకి వచ్చిన వివ్ ఈ విషయాలను వెల్లడించాడు. తనకు ఏది మంచో నిర్ణయించుకోవడానికి తగినంత కృషి సచిన్ చేశాడు. తన కమిట్ మెంట్లేమిటో తనకు తెలుసు. మిగిలిన తన కెరీర్ ను ఎలా మలుచుకోవాలో తనకి తెలుసు” అని సచిన్ ని సమర్ధించాడు. అయితే సచిన్ వెస్ట్ ఇండీస్ కి వచ్చి ఉంటే యువ క్రికెటర్లకు మంచి పాఠాలు నేర్చుకునే అవకాశాలు దక్కేవని వివ్ అభిప్రాయపడ్డాడు. “యువకులకి అతను యాక్షన్ లో ఉండగా చూడడం గొప్ప అనుభూతిని ఇచ్చి ఉండేది. తన ఇన్నింగ్స్ కి ఎలా సిద్ధం అయ్యేదీ, ఇన్నింగ్స్ నిర్మించుకునే విధానం, వివిధ పరిస్ధితులను, ప్రత్యర్ధులను ఎదుర్కొనే పద్ధతీ ఇవన్నీ ఉపయోగపడేవి” అని ఆయన పేర్కొన్నాడు.

సచిన్ చేయబోయే వందవ సెంచురీ పైనే అందరి దృష్టీ, ముఖ్యంగా భారత అభిమానుల దృష్టి కేంద్రీకృతమై ఉంది.

వ్యాఖ్యానించండి