అమెరికా, ఇంగ్లండుల అండతో పాలస్తీనా భూభాగాన్ని చెరబట్టిన ఇజ్రాయెల్ ఆక్రమణని నిరసిస్తూ, 63 ఏళ పాశవిక నిర్బంధాన్నీ, పశు ప్రవృత్తితో సమానమైన ‘యూదు జాత్యహంకారాన్ని’ ఎదిరిస్తూ వేల మంది పాలస్తీనీయులు మే 15 తేదీన ఇజ్రాయెల్ లోని జాఫా పట్టణంలో ఉద్రిక్తల నడుమ నక్బా (వినాశన దినం – పాలస్తీనీయుల భూభాగంపై ఇజ్రాయెల్‌ని సృష్టించిన రోజు) ని పాటించారు. రోమాంఛితమైన ఆ ఘటనను చిత్రించినప్పటి వీడియోలే ఇవి.
ప్రదర్శనలో పాల్గొన్న ఓ కార్యకర్త ఒమర్ సిక్సిక్ ప్రకటన: “మాలో ప్రతి ఒక్కరి తరపున ఇజ్రాయెల్ పాలక వ్యవస్ధకు చెబుతున్నా. నేను నా మాతృ భూమికి కొత్తవాడిని కాను. మీ భావాలకు బందీని కాను. మీ దూషణలు ఏవైనా నేను స్వేచ్ఛా జీవిని. మీ అణచివేత ఎంత పాశవికమైనా నేనీ భూమికి యజమానిని”
ఇజ్రాయెల్ చుట్టుపక్కల అరబ్ దేశాల్లో తలదాచుకుంటున్న పాలస్తీన శరణార్ధులు తమ మాతృ భూమికి, తమ సొంత ఇళ్ళకు తిరిగి రావడానికి 63 సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ సమాజం వారికి మిగిల్చింది మొండిచెయ్యే. ఇప్పటికీ పాలస్తీనీయుల గెంటివేత, వారి ఇళ్ళ కూల్చి వేత కొనసాగుతూనే ఉన్నాయి. నియంతృత్వాల్ని కూల్చి ప్రజాస్వామ్యాన్ని స్ధాపిస్తానంటూ బయల్దేరే అమెరికా, పశ్చిమ రాజ్యాలు ఇజ్రాయెల్‌కి వత్తాసుగా నిలుస్తున్నాయి.
<object style=”height: 390px; width: 640px”><param name=”movie” value=”http://www.youtube.com/v/DyZ40CuWreQ?version=3″><param name=”allowFullScreen” value=”true”><param name=”allowScriptAccess” value=”always”></object>
<object style=”height: 390px; width: 640px”><param name=”movie” value=”http://www.youtube.com/v/4BRnYI6Tx-I?version=3″><param name=”allowFullScreen” value=”true”><param name=”allowScriptAccess” value=”always”></object>