జపాన్లో మరో పెద్ద భూకంపం, సునామీ హెచ్చరిక జారీ


జపాన్లో మార్చి11 న వచ్చిన తీవ్ర స్ధాయిలో సంభవించిన భూకంపం, దాని వలన వచ్చిన భయానక సునామీ లు కొట్తిన దెబ్బ నుండి జపాన్ ఇంకా తేరుకోలేదు. ఇంత లోనే ప్రకృతి పగ బట్టిందా అన్నట్లు మరో తీవ్ర భూకంపం జపాన్ ను వణికిస్తోంది. మార్చి 11 న భూకంపం సంభవించిన ఈశాన్య జపాన్ ప్రాంతానికి దగ్గరగా సముద్రంలో 7.4 తీవ్రతతో తాజా భూకంపం సంభవించినట్లు రాయిటర్స్ సంస్ధ తెలిపింది.

జపాన్ ప్రభుత్వం తాజా భూకంపం దరిమిలా సునామిక హెచ్చరికను జారీ చేసింది. జపాన్ రేడియో, టీవీలు పదే పదే సునామీ హెచ్చరికను ప్రకటిస్తూ, లోతట్టున సముద్రపు ఒడ్డుకి దగ్గరగా ఉన్నవారు మెరక ప్రాంతాలకు వెళ్ళమన్న ప్రభుత్వ ప్రకటనను ప్రసారం చేస్తున్నాయి.

వ్యాఖ్యానించండి