జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

పెనుగొండలో హంపి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం, 25 మంది దుర్మరణం -ఫోటోలు

హుబ్లి-బెంగుళూరు హంపి ఎక్స్ ప్రెస్ పెనుగొండ వద్ద ప్రమాదానికి గురయింది. ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో 13 మంది మంటల్లో చిక్కుకుని చనిపోగా మిగిలినవారు గాయాలతో చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. 3 గంటలకి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా ఢీకొట్టడం వల్ల ఇంజను వెనక ఉన్న బోగీకి నిప్పు అంటుకుని ఆ తర్వాత మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే పెనుగొండ డి.ఎస్.పి కి కబురు అందిందనీ వెంటనే ఆయన సిబ్బందితో చేరుకున్నా అప్పటికే జరగాల్సింది జరిగిందని తెలుస్తోంది. చనిపోయినవారిలో ఎక్కువమంది మొదటి రెండు బోగీల్లో ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరగచ్చని తెలుస్తోంది. షాక్ నుండి తేరుకునే లోపు మంటలు చుట్టుముట్టడంతో తప్పించుకోలేకపోయారని పత్రిక తెలిపింది. ప్రమాదం గురించి తెలిసిన మంత్రులు, ఎం.పి లు, ఎమ్మేల్యేలు ప్రమాద స్ధలికి చేరుకున్నారు.

సిగ్నల్ సిబ్బంది, డ్రైవర్ ల వల్ల జరిగిన తప్పుల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని సౌత్ వెస్ట్రన్ డివిజన్ రైల్వే మేనేజర్ మణి చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది. సిగ్నల్ ని చూడకుండా డ్రైవర్ ముందుకొచ్చాడని కూడా చెబుతున్నారు. మృతులకు 5 లక్షలు, తీవ్ర గాయాలయినవారికి 1 లక్ష, కొద్ది గాయాలయినవారికి 25,000 నష్టపరిహారాన్ని రైల్వే మంత్రి ముకుల్ రాయ్ ప్రకటించాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రమాద స్ధలిని సందర్శించాడు.

కింది ఫోటోలను ‘ది హిందూ’ పత్రిక అందించింది.

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on మే 22, 2012 by in ఇతరములు and tagged , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
Thirupalu on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
prem on ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రే…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
విశేఖర్ on అవినీతిని సహించరట! -కార్ట…
suresh on అవినీతిని సహించరట! -కార్ట…
Praveen Nakkavanipal… on పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో…
moola on సాంకేతిక పురోగతితో ఫోటోగ్రఫీ ప…
విశేఖర్ on అవినీతిని సహించరట! -కార్ట…
rakesh on అవినీతిని సహించరట! -కార్ట…
Sri on పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో…
Sudhakar on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…
విశేఖర్ on అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీ…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 545గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 397,100 సార్లు

క్యాలెండరు

మే 2012
సో మం బు గు శు
« ఏప్రి   జూన్ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 545గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: