ఇరాన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం, రాళ్ళతో కొట్టి గానీ లేదా ఉరితీయడం ద్వారా గానీ
వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న నడి వయసు ఇరానియన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందని ఇరాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వేరోక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి “సకినే మొహమ్మది అష్తియాని” అనే మహిళకు గత సంవత్సరం ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను రాళ్ళతో కొట్టి చంపడం ద్వారా అమలు చేయాలని ఇరాన్ కోర్టు తీర్పు ఇవ్వడంతో దానికి…