ఆశకు తగిన కారణం -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 6, 2014 నాటి ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ఐదు అణ్వస్త్ర దేశాలు మరియు జర్మనీ (P5+1), ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న చర్చల ఎగుడు దిగుడు చరిత్ర గురించి బాగా తెలిసినవారు సదరు చర్చల తాజా రౌండ్, జూన్ 2015 వరకు మరో కొనసాగింపుకు నోచుకోవడాన్ని ఆశాభావంతో పరికించడం పట్ల చేయగలిగేది ఏమీ లేదు. ఇరాన్ తన మౌలిక అణు నిర్మాణాలను అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించడానికీ, ఆంక్షల నుండి గణనీయ మొత్తంలో,…

ఇరాన్ ఒప్పందాన్ని చెరపొద్దు, ఇజ్రాయెల్ తో బ్రిటన్

ఇరాన్ తో పశ్చిమ దేశాలు కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం ఇజ్రాయెల్ ను ఒంటరి చేస్తోంది. ‘చరిత్రాత్మక ఒప్పందం’ గా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పేర్కొన్న ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ‘చారిత్రక తప్పిదం’గా తిట్టిపోసాడు. “ఇరాన్ ఒప్పందాన్ని చెరపడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదు” అని ఇజ్రాయెల్ ప్రధానికి బదులిస్తూ బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. “ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎవరైనా సరే, ఇజ్రాయెల్ తో సహా, చర్యలు తీసుకోకుండా చూస్తాము.…

P5+1 – ఇరాన్ ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం

ఇరాన్, P5+1 దేశాల మధ్య ఇరాన్ లో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర స్ధాయిలో సాగించిన లాబీయింగు విఫలం అయింది. ఒప్పందం ఫలితంగా ఇరాన్, 20 శాతం మేర యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిలిపేస్తుంది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ పై విధించిన వాణిజ్య ఆంక్షలను 6 నెలల పాటు పాక్షికంగా ఎత్తేస్తారు. ఇది తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగడానికి తగిన భూమిక ఏర్పడడానికి…

ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు…