25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను…