హెలికాప్టర్ క్రాష్: సి‌డి‌ఎస్ బిపిన్ రావత్ దుర్మరణం

భారత సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి‌డి‌ఎస్) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడు లోని నీలగిరి కొండల్లో ఆయన ప్రయాణిస్తున్న ఎం-17 హెలికాప్టర్ కూలి దుర్మరణ చెందారు. జనరల్ బిపిన్ రావత్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కి ఛైర్మన్ కూడా. ఈ పదవిలో నియమితులైన మొట్ట మొదటి ఆర్మీ అధికారి ఆయన. జనరల్ బిపిన్ రావత్ డిపార్ట్^మెంట్ ఆఫ్ మిలట్రీ అఫైర్స్ కి కూడా అధిపతిగా వ్యవహరించారు. 1 జనవరి 2020…

కెమెరా కంటికి చిక్కిన హెలికాప్టర్ క్రాష్ -ఫొటోలు

న్యూజిలాండ్ లో ఆక్లాండ్ నగరంలో బుధవారం జరిగిందీ ఘటన. వైడక్ట్ హార్బర్ వద్ద క్రిస్టమస్ ట్రీని నిలపడానికి హెలికాప్టర్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా అది కూలిపోయింది. చుట్టూ జన సమ్మర్ధం ఉన్నప్పటికీ ఎవరికీ తీవ్ర గాయాలేవీ తగల్లేదని రాయిటర్స్ తెలిపింది. పైలట్ కూడా పెద్ద గాయాలు తగలకుండా బైటపడ్డాడట. ప్రవేటు వ్యక్తి కెమెరాలో బంధించగా అతని నుండి రాయిటర్స్ ఈ వీడియో సంపాదించింది.