‘హరిద్వార్’ పుణ్యక్షేత్రం వద్ద తొక్కిసలాట, 16 మంది భక్తుల దుర్మరణం

హిందువుల పుణ్య క్షేత్రం హరిద్వార్ లో ‘ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ’ గారి వందవ పుట్టినరోజు సందర్భంగా జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 14 మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. గంగా నదిపై గల ప్రఖ్యాతి చెందిన ‘హర్ కి పురి’ ఘాట్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరో ముప్ఫై మంది గాయపడ్డట్లుగా జిలా కలెక్టర్ తెలిపాడు. చనిపోయినవారు ఎక్కువమంతి వయసు మళ్ళినవారేనని ఎస్.పి తెలిపాడు. కొన్ని పదుల వేలమంది హాజరైన…