రెండు వారాల దీక్షకు ఒప్పందం, గడువు ముగిశాక సమీక్ష

జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన అన్నా హజారే దీక్ష గడువు విషయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు జరిగాయి. మూడు రోజుల గడువునుండి ఐదురోజులకూ, అటు పిమ్మట వారానికీ గడువు పెంచినప్పటికీ హజారే బృందం తిరస్కరించడంతో పోలీసులు అన్నా బృందానికి నచ్చజెప్పటానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి రెండు వారాల పాటు దీక్షను అనుమతించడానికి పోలీసులు, అన్నా హజారే బృందం అంగీకరించారు. అయితే రెండు వారాల…

రాహుల్ జోక్యంతో విడుదల ఉత్తర్వులు, విడుదలకు నిరాకరిస్తున్న హజారే

అన్నా హాజారే అరెస్టు పాలక కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలనే సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో పాత నెహ్రూవియన్ విధానాలకీ, గత రెండు సంవత్సరాలుగా వేళ్ళూనుకున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాల రూపకర్తలకూ మధ్య గల విభేధాలు అన్నా హజారే నిరాహార దీక్ష సందర్భంగా మరొక్కసారి వెల్లడయ్యాయి. అన్నా హజారేని ఉదయాన్నే అరెస్టు చేయించిన చిదంబరం, మన్మోహన్ ల ముఠా తీరా అరెస్టు చేసాక తలెత్తిన వ్యతిరేకతతో డంగైనట్లుగా కనిపిస్తున్నది. హజారే బృందాన్ని అరెస్టు చేశేవరకూ అనుకున్నట్లు సాగినా వారిని…