స్పెయిన్ ప్రమాదం: విధ్వంసం-రుధిరం-దుఃఖం పెనవేసుకుని…

ఎంత సేపని! ఈ ప్రమాదం మొదలయ్యి పూర్తి కావడానికి అయిదంటే అయిదే క్షణాలు పట్టింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు 78 ప్రాణాలు హరీమన్నాయి. మృతులు ఎంత హృదయ విదారకంగా మరణించారంటే, 80 మంది మరణించారని చెప్పిన అధికారులు ఆ తర్వాత సంఖ్యను 78కి తగ్గించుకున్నారు. ఈ సంఖ్య మళ్ళీ మారవచ్చని కూడా వారు తెలిపారు. అంటే పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. ప్రమాదంలో విధ్వంసం ధాటికి మృత దేహాల శరీర భాగాలు తునాతునకలై పోవడం వలన ఈ…

స్పెయిన్ రైలు ప్రమాదం చివరి క్షణాలు, చూసి తీరాలి -వీడియో

బహుశా ఇలాంటివి స్పెషల్ ఎఫెక్టులతో తీసే హాలీవుడ్ సినిమాల్లోనే చూడగలం. ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ క్షణాల్లో అక్కడ ఎందుకు ఉన్నాడో గానీ స్పెయిన్ లో రైలు పట్టాలు తప్పిన చివరి క్షణాలని వీడియోలో బంధించగలిగాడు. గంటకు 180 కి.మీ వేగంతో వస్తున్న హై స్పీడ్ రైలు పట్టాలు తప్పుతున్న దృశ్యాన్ని సజీవంగా బంధించడం ఎలా సాధ్యం? వంపు ఉన్న చోట గంటకి 90 కి.మీ వేగాన్ని మించకూడదని స్పెయిన్ చట్టాలు ఉన్నాయట. ఆ చట్టాన్ని…

స్పెయిన్: 40 యేళ్లలో అతి పెద్ద రైలు ప్రమాదం -ఫోటోలు

స్పెయిన్ లో భారీ రైలు ప్రమాదం చోటు జరిగింది. వంపులో పరిమితికి మించి వేగంతో ప్రయాణించడంతో హై స్పీడు రైలు పట్టాలు తప్పింది. దుర్ఘటనలో ఇప్పటికీ 78 మంది మరణించినట్లు లెక్క తేల్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. పట్టాలు తప్పినప్పుడు రైలు ఎంత వేగంగా వెళ్తోందంటే పట్టాలు తప్పిన ఒక కంపార్టుమెంటు ఆ వేగానికి తన ముందున్న కంపార్టుమెంటుని గుద్దుకుని ఎగిరి పైకి లేచి పక్కనే ఉన్న ఎత్తైన గోడని దాడి అవతల ఉన్న…