ఫుకుషిమా అణు కర్మాగారం కార్మికులకు ‘స్టమక్ ఫ్లూ’
భూకంపం, సునామీల బారినపడి ప్రమాదానికి గురైన ఫుకుషిమా అణు కర్మాగారం లో శుభ్రపరిచే పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు స్టమక్ ఫ్లూ సోకడంతో డజన్లమందిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద పరిస్ధితి స్ధిర దశకు (స్టబిలిటీ) వచ్చిందని జపాన్ ప్రధాని ప్రకటించిన మరుసటిరోజే కార్మికులు జబ్బుబారిన పడడం విశేషం. అణు ప్రమాదం కారణంగా కర్మాగారంలో విడుదలైన రేడియో ధార్మిక వ్యర్ధ పదార్ధాలను శుభ్రపరిచే కార్యక్రమంలో కార్మికులు అనేక నెలలుగా నిమగ్నమై ఉన్నారు. కార్మికులకు…