ఫ్లేమ్: సైబర్ హై వే పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -3
ఇరానియన్ అణు శుద్ధి కేంద్రం ‘నటాంజ్’ లో స్టక్స్ నెట్ వైరస్ సృష్టించిన విధ్వంసం వెల్లడయిన రెండేళ్ల తర్వాత ‘ఫ్లేమ్’ అనే మరో వైరస్ గురించి కంప్యూటర్ నిపుణులు బయటపెట్టారు. ప్రధానంగా ఇరాన్ పై ప్రయోగించబడిన ఫ్లేమ్ ఫైరస్ ఇజ్రాయెల్ తో పాటు, మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనుగొన్నామని నెల క్రితం వారు తెలిపారు. ఫ్లేమ్ ఫైరస్ కూ స్టక్స్ నెట్ వైరస్ కూ అనేక పోలికలు ఉన్నాయనీ…


