మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?

(సోమా చౌధురి జనవరి 9 తేదీన తెహెల్కా పత్రికకు రాసిన వ్యాసం ఇది. తెహెల్కా పత్రికకు ఆమె మేనేజింగ్ ఎడిటర్. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రమ గారు తన వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలే దాదాపుగా ఇందులో వ్యక్తం అయ్యాయి. ప్రధాన స్రవంతి లోని పత్రికా రచయితలు దేశ సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను ఈ మాత్రం ప్రశ్నించడం ఒకింత సంతృప్తి కలిగించినా, ఆంగ్ల పత్రిక కనుక లక్ష్యిత సెక్షన్లను చేరదన్న తెలివిడి నిరాశను కలిగిస్తుంది. తెలుగు బ్లాగర్లకు…