ఇజ్రాయెల్ పై ఇరాన్ ముందస్తు దాడి? రష్యా మద్దతు?

అక్టోబర్ 1 తేదీన ఇరాన్ దాదాపు 180 కి పైగా మిసైళ్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనీయేను ఇరాన్ లో ఉండగా మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. హమాస్ సుప్రీం నేత హసన్ నాసరల్లా తో పాటు మరో 7 గురు హిజ్బోల్లా టాప్ కమాండర్లు బీరూట్ లోని బంకర్లలో సమావేశమై ఉండగా వరుస మిసైల్ దాడితో ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈ హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ రాజధాని…

పశ్చిమ అదుపులో ఉక్రెయిన్ హంతకదళాలు -రష్యా

సైన్యం పేరుతో తూర్పు ఉక్రెయిన్ లో నరమేధం సాగిస్తున్న ఉక్రెయిన్ హంతకదళాలు పశ్చిమ దేశాల అదుపులో ఉన్నాయి తప్ప ఉక్రెయిన్ ప్రభుత్వం అదుపులో కాదని రష్యా విదేశీ మంత్రి తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు ఆహారం, నీరు తదితర సహాయం అందజేయడానికి వీలుగా జర్మనీలో చర్చలు జరుపుతున్న విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ ఈ సంగతి పత్రికలకు తెలిపారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రికి ఈ దళాలు హెచ్చరిక జారీ చేయడం బట్టి ఇది రుజువవుతోందని ఆయన తెలిపారు.…