పునరాగమనంలో ఎమోషనల్ ఐపోయిన టెన్నిస్ రాణి సెరెనా విలియమ్స్ -ఫోటోలు

పశ్చిమ దేశాల ఆధిపత్యంలో ఉండే ఫ్రొఫెషనల్ లాన్ టెన్నిస్ రంగంలోకి సెరెనా, వీనస్ సోదరీమణుల రాక ఓ సంచలనం. గ్రౌండ్‌లో అడుగు పెట్టిన ప్రతిసారీ సింహనాదాలతో చెలరేగే చిన్న విలియమ్స్ సెరెనా, ఈ సారి మొదటి రౌండ్ గెలవడంతోటే ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యింది. 13 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళను సొంతం చేసుకున్న 29 ఏళ్ళ సెరెనా, ఈ ఏడు వింబుల్డన్ టెన్నిస్ లోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగు పెట్టకముందు 49 వారాల పాటు టెన్నిస్‌కి దూరంగా…