యూరోజోన్ సంక్షొభం భయాలతో కుప్పకూలిన భారత షేర్‌మార్కెట్లు

యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు…

వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయిన ఇండియా షేర్ మార్కెట్

భారత ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాలను చవి చూశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ వడ్డీరేట్లు పెంచడం, వడ్డీ రేట్ల పెంపుదల లాభాల తగ్గుదలకు దారీతీస్తుందన్న భయాలూ, వీటితో పాటు ఆయిల ధరలు అన్నీ కలిసి ఇండియా మార్కెట్లలొ షేర్ల అమ్మకాల వత్తిడి పెరగడానికి దారి తీశాయి. ద్రవ్య సంస్ధలు, టెక్నాలజీ షేర్లు ఎక్కువగా నష్యపోయాయి. ఎయిర్ టెల్ షేరు 3.2 శాతం నష్టపోయింది. ఎయిర్ టెల్ కి చెందిన…

ఆర్.బి.ఐ ద్రవ్యవిధానం దెబ్బకి భారీగా నష్టపోయిన ఇండియా షేర్‌మార్కెట్

భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్‌ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని…