స్వామి జీనీని వదిలారు, అనుభవిస్తున్నారు! -కార్టూన్

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ నేతలపై, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాడి చేయడమే పనిగా పెట్టుకున్న సుబ్రమణ్య స్వామి ఇటీవల చూపు తిప్పారు. పైకి ఆర్ధిక శాఖ నియమిత అధికారులను లక్ష్యం చేస్తూ లోపల ఆర్ధిక మంత్రి జైట్లీని సాధిస్తున్నారు. సుబ్రమణ్య స్వామి ఓ శుభ దినాన ఆర్‌బి‌ఐ గవర్నర్ రఘురాం రాజన్ ను లక్ష్యంగా చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా దూషణలు రువ్వటం ప్రారంభించినపుడు ఆయన లక్ష్యం ఎవరో త్వరగా అర్ధం కాలేదు. తన దూషణల్లో…

రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ

“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బి‌జే‌పి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు. హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్? రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని…

వడ్డీ రేట్లు: పరిశ్రమ వర్గాల ఏడుపు – కార్టూన్

రెండు రోజుల క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీ రేట్లు కదల్చకుండా యధాతధంగా ఉంచారు. వడ్డీ రేట్ల వ్యవహారం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంల మధ్య ఎప్పుడూ ఘర్షణకు దారి తీసే అవకాశం గల సమస్యగా ఉంటోంది. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్ల చుట్టూ ఏర్పడి ఉన్న వాతావరణం. వడ్డీ రేటు…

క్లుప్తంగా …8/6/2016

తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! పోరాటం కొనసాగుతుంది -శాండర్స్ సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు కేరళను తాకిన నైరుతి ఋతుపవనం రాజన్ భారతీయుడే -ఆర్‌బి‌ఐ తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ…

స్వామి గొంతు మారింది, బి.జె.పి నోరు జారింది

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోళ్లపై నిప్పులు చిమ్ముతున్న స్వామి తీరా ఒప్పందం కుదిరి ప్రధాని సంతకం అయ్యాక పాక్షికంగా వెనక్కి తగ్గారు. ప్రధాని గనక ఒప్పందం కుదుర్చుకోవడంలో ముందుకు వెళ్తే కోర్టుకు వెళ్ళడం తప్ప తనకు మరో మార్గం లేదని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటిది ఫ్రాన్స్ పర్యటన మొదటి రోజే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి ‘పడవ పై చర్చ’ జరిపి 36 జెట్లను రెడీగా ఉన్నవి కొనుగోలు చేయాలని ప్రధాని…

రాఫెల్ కు స్వామి నో, మోడి యెస్

రాఫెల్ ఫైటర్ జెట్లు తక్షణ ప్రాతిపదికన ఏకంగా 36 కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాన్స్ బయలుదేరుతూనే రాఫెల్ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వెళ్ళిన ప్రధాని చెప్పినట్లుగానే ‘పడవపై చర్చలు’ జరిపి భారీ కొనుగోలుకు తలూపారు. మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయడం కాదు. ఇప్పటికే తయారై ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ జెట్ విమానాలనే ఇండియా కొనుగోలు చేయనుంది. జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు…

కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి

ప్రధాన మంత్రి గా సోనియా గాంధీ నియామకం విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాలు చెప్పడం లేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించాడు. ప్రధాని పదవికి సోనియా నియామకం జరగదని కలాం ఒక లేఖ కూడా సోనియాకి రాశాడనీ, తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా భారత పౌరసత్వం పొందినందున సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి నాయపరమైన సమస్యలున్నాయని తాను కలాంకి వివరించాననీ,…