బీహార్ ఎస్ఐఆర్ చట్ట వ్యతిరేకం అని రుజువు చేస్తే, రద్దు చేసేస్తాం! -సుప్రీం కోర్టు

“స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (ఎస్ఐఆర్) పేరుతో బీహార్ వోటర్ల జాబితా మొత్తాన్ని తిరగ రాసేందుకు తెగబడ్డ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ), సుప్రీం కోర్టులో అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్నది. బీహార్ ఎస్ఐఆర్ చట్ట విరుద్ధం అంటూ యోగేంద్ర యాదవ్ లాంటి స్వతంత్ర పరిశీలకులు, ఏడిఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్) లాంటి ఎన్.జి.ఓ లు, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా లాంటి రాజకీయ నాయకులు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా…

లడ్డు: భక్తుల మనోభావాలతో ప్రభుత్వమే ఆడుకుంది -సుప్రీం కోర్టు

తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన వివాదం సుప్రీం కోర్టును చేరింది. తన ముందుకు వచ్చిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, ప్రాధమిక ఆధారాల ప్రకారం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రపంచ వ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రికి ఇది తగదు అని గడ్డి పెట్టింది. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు…

కేజ్రీవాల్ కి బెయిల్

ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిలు మంజూరు చేసింది. ఇతర రాజకీయ పార్టీల వలే బెయిల్ మంజూరుని పెద్ద విజయంగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నది. బహుశా నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను జైళ్ల పాలు చేసి వారు ఏ పేరుతోనైనా సరే విడుదల కాకుండా ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వం తరపున వాదించే అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, ఇతర ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా…

క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…

సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు. అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే…

కన్వర్ యాత్రలో మత ఘర్షణలకు ఏర్పాట్లు?

బి‌జే‌పి ప్రభుత్వాల మతతత్వ పూరిత ఆదేశాలు నానాటికి శృతి మించుతున్నాయి. ఏదో విధంగా ముస్లింలపై వ్యతిరేకతను సృష్టించి తగవులు పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించినప్పటికీ లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలం కాలేక పోయాడు. ఐనప్పటికీ బి‌జే‌పి నేతృత్వం లోని ఉత్తరాది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో తమ…

ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

లఖింపూర్ ఖేరా హత్యాకాండ: హత్యకేసు ఇలాగే విచారిస్తారా?

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం తలంటు పోసింది. పోలీసులు విచారణ సాగిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం “మాటలు చెప్పడం వరకే పరిమితం అయింది. చేతల్లో చూపడం లేదు” అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పరుషంగా వ్యాఖ్యానించారు. “రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల మేము సంతృప్తి చెందలేదు” అని ఆయన కుండ బద్దలు కొట్టారు. మోడి కేబినెట్ లోని సహాయ మంత్రి, బి‌జే‌పి…

న్యాయ వ్యవస్ధ లేకుండా చేస్తారా? -సుప్రీం కోర్టు

సాక్షాత్తు సుప్రీం కోర్టు కొరడా ఝళిపిస్తేనే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల విన్నపాలకి దిక్కెవ్వరు? “కర్ణాటక హై కోర్టులో మొత్తం ఒక అంతస్ధు అంతా తాళాలు వేసేశారు. ఎందుకంటే అక్కడ జడ్జిలు లేరు మరి. ఒకప్పుడు జడ్జిలు ఉన్నా కోర్టు రూములు ఖాళీగా లేని పరిస్ధితి ఉండేది. ఇప్పుడు కోర్టు రూములు ఉన్నాయి గాని, జడ్జిలు లేకుండా పోయారు. ఇప్పుడు మీరు కోర్టు రూములు మూసేసి న్యాయానికి తలుపులు వేసేస్తున్నారు” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ…

కేంద్రం రెండో చెంపా వాయించిన సుప్రీం కోర్టు

ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు విషయంలో బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చెంప వాయించిన సుప్రీం కోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంత్రాంగం విషయంపై తీర్పు ద్వారా రెండో చెంప కూడా వాయించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అమలు చేసిన విచక్షణాధికారాలను రద్దు చేసింది. జనవరి 14, 2016 తేదీన ప్రారంభం కావలసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను “తన విచక్షణాధికారాలను వినియోగించి” డిసెంబర్ 16, 2015 తేదీకి మార్చుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని…

కనీవినీ ఎరుగని దోషారోపణ -ది హిందు ఎడిట్

(మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు విచారణ నుండి పక్కకు తప్పుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించిన పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ వ్యాసం. -విశేఖర్) ************** సి.బి.ఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా హయాం గురించి సానుకూలాంశం ఏదన్నా ఉందంటే అది, మరి కొద్ది రోజులలో ఆయన హయాం ముగింపుకు రావడమే. సున్నితమైన కేసుల్లో అత్యంత సామర్ధ్యంతో పరిశోధన చేసిన…

2జి కేసుకు దూరంగా ఉండండి -సుప్రీం కోర్టు

భారత దేశంలో హై ప్రొఫైల్ కేసులను విచారించే హై ప్రొఫైల్ విచారణాధికారులు సైతం విచారణకు ఎలా తూట్లు పొడుస్తారో తెలిపే ఉదంతాలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2జి కేసులోనే ఇలాంటి ఉదాంతాలు నాలుగైదు వెలుగులోకి రాగా సి.బి.ఐ అధిపతి రంజిత్ సిన్హా ఉదంతం మరొకటిగా వచ్చి చేరింది. 2జి కేసు విచారణ నుండి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు (నవంబర్ 20) సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఆదేశించింది. చీఫ్…

ఐ.పి.ఎల్ vis-a-vis సుప్రీం కోర్టు -కార్టూన్

బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాసన్ పుణ్యమాని సుప్రీం కోర్టు కూడా ఐ.పి.ఎల్ పాలకవర్గంలో ఒక పాత్ర పోషిస్తోంది. ధర్డ్ అంపైర్ ధాటికి గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపైర్ల నిర్ణయ శక్తి దాదాపు నామమాత్రంగా మారిపోయినట్లే సుప్రీం కోర్టు ఇటీవల చూపుతున్న చొరవ వల్ల మొత్తం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రతకు ప్రమాదం వచ్చినపడినట్లు కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ గుర్రం ఎవరు? బహుశా క్రికెట్ ఆటగాళ్లకు, అంపైర్లకు, ఆటను చూసే ప్రేక్షక దేవుళ్ళకి ఎవరికీ కనపడకుండా…

మొఖంపై సిరా మరకలు, కెరీర్ పై కస్టడీ మరకలు

‘మరక మంచిదే’ తమ బట్టల సబ్బు ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడానికి ఓ కంపెనీ ప్రచారం చేసే నినాదం ఇది. ఒక సబ్బుల కంపెనీ తన లాభాలు పెంచుకోవడానికి ఎవరూ ఇష్టపడని మరకను కూడా మంచిదే అని చెప్పగలదని నిరూపించే నినాదం కూడా ఇది. ఈ రోజు సుబ్రతా రాయ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు బహుశా ఆయనకు ఈ నినాదాన్నే స్మరించుకునేలా చేసి ఉంటాయి. మొఖంపై పడ్డ సిరా మరక, కోర్టులో పడ్డ కస్టడీ మరక రెండూ మంచివే…

ఉచిత పధకాల ఖర్చు మోయలేం బాబోయ్! -కార్టూన్

– “మరేం ఫర్వాలేదు – మాకు సంతోషమే. ఎందుకంటే ఆ ఉచితాలన్నింటి ఖర్చు ఇక మేము భరించనక్కర్లేదు కదా!” – రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పధకాలు అవినీతి కాదని చెబుతూనే అవి ప్రజాస్వామ్యం మూలాలను కుదిపి వేస్తాయని అంగీకరించింది. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత గ్రైండర్లు, మిక్సీలు, ల్యాప్ టాప్ పంపిణీ పధకాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అవి అవినీతి…

అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది. పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని…