మియాన్మార్ జన జీవనం -ఫొటోలు

మియాన్మార్ (బర్మా) గురించిన వివరాలు ఇన్నాళ్ళూ పెద్దగా ప్రపంచానికి తెలియదు. విదేశీ పత్రికలపై ఉన్న ఆంక్షలు అందుకు కారణం కావచ్చు. గత డిసెంబర్ నుండి అక్కడి ప్రభుత్వం కొన్ని రాజకీయ సంస్కరణలు చేపట్టింది. వాటిలో భాగంగా గృహ నిర్భంధం నుండి ప్రజాస్వామ్య ఉద్యమ నేత ‘ఆంగ్ సాన్ సూక్యీ’ ని విడుదల చేసింది. వివిధ కారణాలతో పార్లమెంటులో ఏర్పడిన ఖాళీలను నింపడానికి జరిపిన ఉప ఎన్నికల్లో సూక్యీ పార్టీ ‘ఎన్.ఎల్.డి’ ని పోటీ చేయడానికి అనుమతించింది. ఎన్నికల…

Teen killed

రు. 50 వేల కోసం క్లాస్ మేట్ ని హత్య చేసిన టెన్త్ విద్యార్ధులు

విలాసాల ఖర్చుల కోసం పదో తరగతి విద్యార్ధులు తమ క్లాస్ మేట్ ని కిడ్నాప్ చేసి హత్య చేసిన దారుణం పూణె లో చోటు చేసుకుంది. క్లాస్ మేట్ తల్లిదండ్రులకు గర్భ శోకం మిగల్చడమే కాక తమ తల్లిదండ్రులను సైతం సమాజంలో తలెత్తుకోనీకుండా చేసిన విద్యార్ధులు తమకు టి.వి సీరియళ్ళు స్ఫూర్తినిచ్చాయని పోలీసులకి చెప్పారు. టి.వి సీరియళ్ళే తమకు దారి చూపాయని విద్యార్ధులు తమ విచారణలో చెప్పినట్లుగా పోలీసు అధికారులు చెప్పారు. శుభం షిర్కే పూనె లో…

ఆఫ్రికా ఆదిమ జాతుల క్రికెట్ సొగసు చూడవలసిందే -ఫొటోలు

కొత్త రాతి యుగం నుండి ఉనికిలో ఉన్న ‘మాసాయ్’ ఆదిమ జాతి కీన్యా, టాంజానియాలలో నివసిస్తోంది. వీరి జనాభా కేవలం నాలుగు లక్షలే. సంచార జాతి అయిన మాసాయ్ అనేక ప్రాచీన ఆచారాలకు నెలవు. వీరిని సంచార జీవనం నుండి బైటికి రప్పించడానికి ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదని చెబుతున్నారు. అయితే పర్యావరణ మార్పుల రీత్యా సంచార జీవనమే వీరికి శ్రీరామ రక్ష అని ప్రముఖ లండన్ వ్యవసాయ సంస్ధ ‘ఆక్స్ ఫాం’ నిర్ధారించింది. అటు…

చెక్క చెక్కిన చిత్రాలు -ఫొటోలు

ప్రముఖ పోర్చుగీసు కళాకారుడు ‘అలెగ్జాండ్రె ఫార్టో’ అలియాస్ ‘విల్స్’ చెక్కిన బొమ్మలివి. తీసి పారేసిన చెక్కల ఉపరితలాలను క్రమ పద్ధతిలో చెక్కడం ద్వారా పోర్ట్రయిట్ లను సృజించడాన్ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. కొంచెం పరిశీలిస్తే ఇళ్లు లేదా ఆఫీసుల గోడలకి ఉపయోగించిన చెక్కలపైన ఈ చిత్రాలు చెక్కినట్లు కనిపిస్తొంది. పశ్చిమ దేశాల్లో  చెక్క ఇళ్లు ఎక్కువ గనక ఇలా భావించవలసి వస్తోంది. అలెగ్జాండ్రె వయసు 24 సం. మాత్రమే. 2008లో లండన్ లో జరిగిన కేన్స్ ఫెస్టివల్…

పాడుబడిన ఇల్లు, కాదు కాదు… స్ట్రీట్ అక్వేరియం -వీధి (వి)చిత్రం

స్పెయిన్ కళాకారుడు డిమిట్రిస్ టాక్సిస్ సృష్టి ఇది. ‘కార్నెల్లా డి లాబ్రెగాట్’ అనే పేరుగల పట్నంలో రోడ్డు పక్కన ఉన్న పాడు బడిన ఇంటిని ‘స్ట్రీట్ అక్వేరియం’ గా మార్చేశాడు. బైటి గోడలకు కూడా రంగులు వేసినట్లయితే అక్వేరియం లుక్ ఇంకా బాగా వచ్చి ఉండేది. కాని, అలా చేస్తే పాడు బడిన ఇల్లు అని తెలిసేది కాదు. ‘ఒరిజినల్ లుక్’ కీ ‘కళాత్మక దృష్టికీ’ మధ్య సమతూకం పాటించడానికి కళాకారుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.   –…

బానిసకొక బానిసకొక బానిస ఆఫ్ఘన్ మహిళ

తాలిబాన్ మత ఛాందస ప్రభుత్వ అణచివేత నుండి ఆఫ్ఘన్ స్త్రీలను విముక్తి చేస్తామని బీరాలు పలికిన అమెరికా, తన పదేళ్ళ దురాక్రమణలో సాధించిందేమీ లేదని మానవ హక్కుల సంస్ధ ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ నివేదిక వెల్లడించింది. కుటుంబ హింస భరించలేక ఇంటి నుండి పారిపోయినా, భర్త అనుమానంతో పదే, పదే స్క్రూ డ్రైవర్ తో కుళ్ళ బొడిచినా ‘నైతిక నేరానికి’ పాల్పడ్డారంటూ మళ్ళీ స్త్రీలనే ఆఫ్ఘన్ ప్రభుత్వం జైళ్ళలో పెడుతున్నదని హెచ్.ఆర్.డబ్ల్యూ నివేదిక తెలిపింది. ఎన్ని హింసలు…

ప్రపంచ స్ధాయి రేపిస్టులు వీళ్ళు -ఫొటోలు

లైంగిక అత్యాచారాలకు పాల్పడి ప్రపంచ స్ధాయిలో పేరు పొందిన రాజకీయవేత్తలు వీళ్లు. ఈ ఫొటోలను ఫస్ట్ పోస్ట్ అందించింది. ఆయా దేశాలలో ఉన్నత పదవులను అధిష్టించినవారు తమ తమ దేశాల్లోని ఉన్నత సాంస్కృతిక విలువలకు అద్దం పట్టేలా జీవించాలి. ఆయా దేశాల జీవన విధానాలకు అద్దం పట్టడమే కాక మొత్తం ప్రపంచ స్ధాయి విలువలను కూడా వీరి ప్రతిబింబించాల్సి ఉంటుంది. మానవ నాగరికతలో కుటుంబ జీవనానికి అత్యున్నత రూపం అయిన మోనోగమీ (ఒక భర్తకు ఒకే భార్య)…

1989; Sachin Tendulkar

సచిన్ హెయిర్ స్టైల్స్ ఇలా మారుతూ వచ్చాయి -ఫొటోలు

రింగుల జుట్టుతో భారత క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు దాదాపు టార్జాన్ హెయిర్ స్టయిల్ లాంటి పొడుగు జుట్టు తో కనిపిస్తున్నాడు. వివిధ దశల్లో అతని హెయిర్ ఎలా రూపం మారుతూ వచ్చిందో చూపుతున్న ఈ ఫొటోల్ని ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక ప్రచురించింది. –

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ విదేశీ ప్రయాణాల ఖర్చు రు.205 కోట్లు

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జులై 2007 లో పదవిలోకి వచ్చినప్పటి నుండి తన విదేశీ ప్రయాణాల కోసం రు.205 కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టేసింది. 12 సార్లు విదేశీ ప్రయాణాలు చేసిన ప్రతిభా 22 దేశాలను చుట్టి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఆమె పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ త్వరలో దక్షిణాఫ్రికా బయలుదేరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి చేసే ప్రతి విదేశీ ప్రయాణంలోనూ కుటుంబ సభ్యులందరూ వెంట వెళ్ళేవారని తెలుస్తోంది. గత రాష్ట్రపతులెవరూ…

పనికిరాని వాహనాల కొనుగోలుకు ఆర్మీ చీఫ్ కి రు.14 కోట్ల లంచం ఆఫర్

600 సబ్ స్టాండర్డ్ వాహనాల కొనుగోలుకు ఆర్మీలోనే ఉన్న మరొక ఉన్నతాధికారి తనకు రు.14 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వెల్లడించాడు. తనకు లంచం ఇవ్వజూపిన అధికారి ప్రస్తుతం రిటైర్ అయ్యాడని ఆయన తెలిపాడు. సంఘటన జరిగిన వెంటనే ఈ విషయం రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని కి తెలియజేశానని వి.కె.సింగ్ తెలిపాడు. అయితే వి.కె.సింగ్ పత్రికలకు ఈ సంగతి వెల్లడించాక మాత్రమే, సోమవారం, రక్షణ మంత్రి సి.బి.ఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. “ఆరోపణలు…

పరీక్ష హాలులో దళిత బాలికల బట్టలిప్పించిన ఇన్విజిలేటర్లు

పరీక్షల్లో ఎవరైనా విద్యార్ధులు కాపీ కొడుతున్నట్లు అనుమానం వస్తే ఇన్విజిలేటర్లు ఏం చేయాలి? సాధారణంగా జేబుల్లో కాపీ స్లిప్పులు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. కాగితాల కింద దాచి పెట్టారేమో చెక్ చేస్తారు. ఇంకా దాచిపెట్టడానికి ఉన్న అవకాశాలని పరిశీలించి వెతుకుతారు. జామెట్రీ బాక్సుల్లో, రిస్ట్ వాచీ కిందా ఇలాంటి చోట్ల. అయితే దళిత బాలికలైతే ఇవేవీ అవసరం లేదు. పరీక్ష రాస్తున్న వారు 15 సంవత్సరాల బాలికలైనా, సంస్కార హీనమని తెలిసినా వారు దళిత బాలికలైతే అందరి…

బ్లాక్ టీనేజర్ హత్య: అమెరికా వ్యాపితంగా నిరసనలు -ఫొటోలు

బ్లాక్ టీనేజర్ ట్రేవాన్ మార్టిన్ (17 సం.) ను తెల్ల పోలీసు కాల్చి చంపిన కేసును ‘జాత్యహంకార హత్య’ గా భావిస్తున్నారు. హత్య చేసిన పోలీసు ‘ఆత్మ రక్షణ’ నిమిత్తం టీనేజర్ ని కాల్చిచంపానని చెప్పడంతో అతనిని పోలీసులు అరెస్టు చేయలేదు. దానితో రెండు వారాలుగా అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఫ్లోరిడా రాష్ట్రంలో కేంద్రీకృతమైన ఈ ప్రదర్శనలు క్రమంగా అమెరికా అంతటా విస్తరించాయి. ఫిలడెల్ఫియా, న్యూయార్క్, లాస్ ఏంజిలిస్ తదితర నగరాల్లో ‘మిలియన్…

బ్లాక్ టీనేజర్ హత్య పై అట్టుడుకుతున్న అమెరికా

ఫిబ్రవరి 26 వ తేదీన ఫ్లోరిడా రాష్ట్రంలో తెల్ల జాతికి చెందిన పోలీసు ఒకరు నల్ల జాతికి చెందిన టీనేజర్ ను కాల్చి చంపిన విషయంలో అమెరికా అంతటా నిరసనలు చెలరేగుతున్నాయి. 17 యేళ్ళ వయసు కలిగిన ట్రేవాన్ మార్టిన్  నిరాయుధుడుగా ఉన్నప్పటికీ పోలీసు (జిమ్మర్ మేన్ – 28 సం.) అతనిని ‘ఆత్మ రక్షణ’ కోసం చంపినట్లుగా చెబుతున్నాడు. బ్లాక్ టీనేజన్ హత్యలో పోలీసులు ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో దానికి కారణం జాతి పక్ష…

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు 2.4 లక్షలు

అమెరికాలో నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఏడవ స్ధానంలో ఉందని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. 2.4 లక్షల మంది భారతీయులు ఎటువంటి చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని, 2000, 2011 సంవత్సరాల మధ్య వీరి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని అమెరికా తెలిపింది. ఇదే కాలంలో  అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 84.6 లక్షల నుండి 1.151 కోట్లకు పెరిగిందని కూడా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. మెక్సికోకి …

పిల్లల ఊహాశక్తికి నిదర్శనం ఈ పెయింటింగ్ లు -ఫొటోలు

‘ది హిందూ’ పత్రిక ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలు వేసే పెయింటింగ్ లు చాలా సార్లు అబ్బురం కలిగిస్తాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలపైన, ముఖ్యంగా ప్రకృతి పైన వీరికి ఉన్న ఊహాశక్తిని అభినందనించకుండా ఉండలేం. ప్రకృతితో పాటు సమాజం, సంస్కృతి, దేశ భక్తి లాంటి అంశాలపై కూడా వీరి అభిప్రాయాలను అక్కడక్కడా చూడగలం. ప్రధానంగా పాఠ్య పుస్తకాల ద్వారా తమకు అందే విజ్ఞానాన్నే…