ఆఫ్ఘన్ మహిళ ‘షంషియా’ వీధి చిత్రాలు -ఫొటోలు

‘కళా రంగం’ పై తీవ్ర అణచివేత ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో ఒక మహిళ వీధి చిత్రాలు గీయడానికి పూనుకోవడం సాహసమే. కాబూల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన షంషియాని హస్సాని (24) ఆమె మిత్రుడు ఫౌషంజి హస్సాని (25) లు గీసిన చిత్రాలివి. మెయిన్ రోడ్లపక్కన ఉన్న గోడలపై గీయడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వాధికారులు అంగీకరించలేదు. దానితో ముప్ఫై యేళ్ల యుద్ధాల్లో శిధిలమైన భవనాల్లో లోపలి గోడలే వారి కళా తృష్ణకు సాధనాలయ్యాయి. తామే ఫొటోలు తీసి పత్రికలకు…

మురికి కాలవలో అప్పుడే పుట్టిన బాలిక

ఇది రాజస్ధాన్ లో జరిగిన ఘోరం. అప్పుడే పుట్టిన బాలిక మురికి కాలవలో ప్రత్యక్షమైంది. పొద్దున్నే చేసే వ్యాయామంలో భాగంగా నడుస్తూ అటుగా వచ్చినవారు పాప ఏడుపు విని పోలీసులకు చెప్పడంతో పాప బతికిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఒక ఎన్.జి.ఓ సంస్ధ ముందుకు వచ్చి పాపని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్ధాన్ రాజధాని జైపూర్ కి 300 కి.మీ దూరంలో ఉన్న ఉదయ్ పూర్ నగరంలో జరిగిందీ ఘటన. శనివారం ఉదయం జాగింగ్…

GEORGE

కత్తిరింపులు: ఉస్మానియా అగ్నికణం జార్జి రెడ్డి 40 వ వర్ధంతి

జార్జి రెడ్డి పి.డి.ఎస్.యు (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) విద్యార్ధి సంఘం నిర్మాత. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విప్లవ విద్యార్ధి ఉద్యమాలకు ఆద్యుడు. క్యూబా విప్లవకారుడు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని భారత పీడిత ప్రజల పక్షాన విద్యార్ధి ఉద్యమాల నిర్మాణానికి పూనుకున్న అగ్నికణం. ‘పుట్టుకతో వృద్ధులు’గా జీవించడానికి నిరాకరించి ‘పావన నవజీవన బృందావన నిర్మాతల’లో భాగం కావడానికి నిశ్చయించుకున్న స్ఫూర్తి ప్రదాత. యూనివర్సిటీ క్యాంపస్ లో మత దురభిమాన శక్తుల గూండాయిజాన్ని ఎదుర్కొని…

mamata_cartoon

మమత ఫాసిస్టు పోకడ -కార్టూన్

మమత ఫాసిస్టు పోకడలు కొనసాగుతున్నాయి. తన పై గీసిన కార్టూన్ ను ఫార్వర్డ్ చేసినందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ ను అరెస్టు చేయించింది. తన ప్రతిష్టను మసకబార్చడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ యధావిధిగా తన చర్యను సమర్ధించుకుంది. జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర, ఆయన ఇంటిపక్కనే నివసిస్తున్న సుబ్రత సేన్ గుప్తా లను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమత పరువు భంగం, మహిళ ప్రతిష్టకు మచ్చతేవడం, హేకింగ్ లాంటి సెక్షన్లను ప్రొఫెసర్ పై…

కొరియా స్లమ్ డాగ్ సింగర్ -వీడియో

చొయి సంగ్ బాంగ్. ఇప్పుడొక ఇంటర్నేషనల్ సెన్సేషన్. ‘కొరియాస్ గాట్ టాలెంట్’ షో లో అద్బుత ప్రతిభ కనబరిచి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయిన యువకుడు. నైట్ క్లబ్ లో పాటలు విని స్ఫూర్తి పొంది తనకు తాను పాడడం నేర్చుకున్నాడు. కష్టం చేసి సంపాదించిన డబ్బుతో అప్పుడప్పుడూ మ్యూజిక్ క్లాసులకు హాజరయ్యి తన ప్రతిభకు సాన పెట్టుకున్నాడు. టాలెంట్ షో లో ఫైనల్స్ చేరుకుని రెండవ స్ధానం సంపాదించాడు. అనాధగా తీవ్ర కష్టాల్లో పెరిగిన నేపధ్యం ఉన్నప్పటికీ…

పెయింట్ వార్

జర్మనీలో స్కేటింగ్ హోళీ(?) -వీడియో

చూడబోతే వీళ్లకి మన హోళీ పండగే స్ఫూర్తి లాగుంది. ఎక్కడంటే అక్కడ స్కేటింగ్ చేసేస్తూ అందులో రంగుల్ని మిళితం చేశారు. నిజానికి ఇక్కడ స్కేటింగ్ అన్నది అప్రధానం. రంగుల హోళీ యే ప్రధానం. ఒంటి నిండా పొడి రంగులు నిలవ చేసుకుని ఎత్తు పల్లాల దగ్గర స్కేటింగ్ చేయడం ద్వారా ఆ రంగుల్ని గాలిలోకి వెదజల్లుతూ హోళీని స్ఫురింప జేశారు. వీరు చేస్తున్నది హోళీయో కాదో తెలియదు గానీ మనకు తెలిసింది అదే గనుక ‘హోళీ’ అనే…

తీస్తా సెతల్వాద్ పై తప్పుడు కేసు ఆపండి, మోడీ ప్రభుత్వంతో సుప్రీం

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆధ్వర్యంలో ముస్లిం లపై జరిపిన అమానుష ‘హత్యాకాండ’ లో దోషులకి శిక్ష పడడానికి అలుపెరుగని పోరాటం నిర్వహిస్తున్న తీస్తా సేతల్వాద్ పై మోడీ ప్రభుత్వం పెట్టిన కేసు ‘తప్పుడు కేసు’ అనీ, ‘మానవ హక్కులను’ తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదనీ సుప్రీం కోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆమె పై పెట్టిన ‘తప్పుడు కేసు’ లో జరుపుతున్న పరిశోధనను ఆపేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అటార్నీని కోరింది. అయితే ఇప్పటికే కేసులో చార్జి…

ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు…

చపల చిత్తమా, సృజన చిత్తమా ఈ కళాకృతులు? -ఫొటోలు

“బ్రెజిల్ కళాకారుడు ‘హెన్రిక్ ఒలివీరా’ కి తన కళను ప్రదర్శించే గ్యాలరీల గోడలంటే ఏ మాత్రం గౌరవం లేనట్టుంది. లేకుంటే తన బుర్రను చీల్చుకు వచ్చిన అవుడియాల కోసం ఈ రకంగా గోడల్ని చీల్చేస్తాడా? తన చిత్తానికి తగ్గట్లు మెలికలు తిరుగుతూ నేలనీ, గోడల్నీ, పై కప్పుల్నీ తొలిచేలా  చెట్లను శాసించడానికి ఈయనకి మానవతీత శక్తులేవో ఉన్నట్లున్నాయి మరి.” ఒలివీరా ‘సావొ పోలో’ లో విద్యార్ధిగా ఉన్నపుడు తన గది బయట ప్లై వుడ్ తో చేసిన…

vandemaataram

“వందే మాతరం” -చెరబండరాజు కవిత

(యు.పి లో ఒకే రోజు జరిగిన నాలుగు అత్యాచారాల విషయమై రాసిన పోస్టు కి రాజశేఖర రాజు గారు అద్భుతమైన స్పందన పోస్ట్ చేసారు. ప్రముఖ విప్లవ కవి ‘చెరబండ రాజు’ రాసిన కవితను సందర్భ శుద్దిగా ప్రస్తావించిన రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యని యధా విధిగా ఇస్తున్నాను. చెరబండరాజు కవితకి ఇప్పటికీ ఎంత ప్రాధాన్యం ఉన్నదో కవిత చదివితే ఇట్టే అర్ధం అవుతుంది. దేశ భక్తి పరులు నిజంగా ఆలోచించవలసిన అంశాలు ఈ…

యు.పి: ఒకే రోజు నాలుగు రేప్ లు, మూడేళ్ళ పాపతో సహా

ఉత్తర ప్రదేశ్ లో ఒకే రోజు నాలుగు రేప్ కేసులు పోలీసులని చేరాయి. ఒక దళిత బాలిక, మూడేళ్ళ పాప వారిలో ఉన్నారు. రేపిస్టులు తాము చెయ్యదలుచుకున్నది చేసి బాధితులను నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలి పెట్టారు. పదేళ్ళ బాలికను అతని మేనమామతో సహా నలుగురు వ్యక్తులు రేప్ చేశారు. సామూహిక మానభంగానికి గురయిన దళిత బాలిక ఫిర్యాదుని స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. రెండు రోజులు తిప్పుకున్న తర్వాత మాత్రమే ఫిర్యాదు నమోదు చేశారు. ఝాన్సీ లో ఓ…

AIZHAI China

ప్రపంచ భారీ వంతెనలు -ఫొటోలు

మానవ నాగరికత సాధించిన ప్రగతికి ఈ వంతెనలు ప్రతి రూపాలు. అత్యంత పొడవైన వంతెనలు, భారీ వంతెనలు, ఎత్తయిన వంతెనలు చూసినపుడు మానవ మేధస్సుకి పరిమితులు లేవేమో అనిపిస్తుంది. ‘అరచేతిలో వైకుంఠం’ కాదు గానీ, అరచేతిలో ఇమిడి పోతున్న సెల్ ఫోన్లలోకి ప్రపంచం అంతటినీ క్షణాల్లో సాక్షాత్కరింపజేయగలిగిన మేధస్సు మనిషి సొంతం. ఫ్యూడల్ వ్యవస్ధ సాధించిన భారీ నిర్మాణాలకు సాంకేతికతను జోడించి మనిషి జీవనానికి మరింత సౌఖ్యాన్ని జోడించడంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ సాధించిన ప్రగతిని కొట్టివేయడానికి వీల్లేదు.…

శ్రీకాంత్, ఇది మీకే

శ్రీ, మీరూ ఒకరేనని రామ్మోహన్ గారు భావించారు. కాదని మీరంటున్నారు. ఈ విషయంలో నేను లేను గనక ఆ విషయంపై నేను రాయడం భావ్యం కాదు. ‘తోటి బ్లాగర్లను గౌరవించండి’ అని కోరడం ‘విరుచుకుపడం’ గా మీరు చెప్పడం సరికాదేమో ఒకసారి ఆలోచించండి. కాదు ‘విరుచుకుపడడమే’ అంటారా, మీ యిష్టం. స్ట్రాస్ కాన్ సోషలిస్టు అని ఎలా భావిస్తున్నారు అని సవాలు చేస్తూ అడిగినట్లు నాకు గుర్తు లేదు. ఆయన సోషలిస్టు కాదు గనక, కాదు సోషలిస్టే…

బ్లాక్ అండ్ వైట్ కవలలకి ఏడేళ్లు -ఫొటోలు

బ్రిటన్ దేశ కవలలు వీళ్లు. ఈ ఏప్రిల్ కి వీరికి ఏడేళ్లు నిండాయి. తల్లి దండ్రులు ఇద్దరూ వైట్ మదర్ కీ, బ్లాక్ ఫాదర్ కీ పుట్టినవాళ్ళే కావడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైందని డాక్టర్లు చెప్పారు. ఇది అరుదే అయినప్పటికీ అసాధ్యమేమీ కాదట. ప్రతి మిలియన్ బ్లాక్ అండ్ వైట్ జంటల్లో ఒక జంటకు మాత్రమే ఈ విధంగా వేరు వేరు రంగుల్లో ఐడెంటికల్ ట్విన్స్ పుట్టే అవకాశం ఉంటుందట. పుట్టినపుడు ఇద్దరికీ నీలి రంగు…

సెక్స్ వ్యాపారంలో వాల్ స్ట్రీట్ కంపెనీ ‘గోల్డ్ మేన్’ పెట్టుబడులు

గోల్డ్ మేన్ సాచ్ అమెరికాలో అతి పెద్ద వాల్ స్ట్రీట్ కంపెనీ. పేరు మోసిన ఆన్ లైన్ సెక్స్ పత్రికలో ఈ కంపెనీకి పెట్టుబడులున్నాయని ‘న్యూయార్క్స్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. తన క్లయింట్లను తానే మోసం చేస్తున్నదంటూ గోల్డ్ మ్యాన్ సాచ్ కంపెనీ యూరప్ విభాగం ఉపాధ్యక్షుడు కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశాడు. అది మరుపులోకి జారకముందే అమ్మాయిలతో వ్యాపారం చేసే కంపెనీలో సైతం ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి కావడం అమెరికా ప్రజలని…