‘700 కోట్ల’ వ బిడ్డకు స్వాగతం -కార్టూన్

అక్టోబరు 31 సాయంత్రంతో 700 కోట్లవ బిడ్డ జన్మించాడని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ క్రెడిట్ ని భారత్, ఫిలిప్పైన్స్ లకు చెందిన ఇద్దరు పసికందులు సంపాదించుకున్నారు. అయితే, సురక్షితమైన తల్లి గర్భం నుండి భూమ్మీదికి అడుగుపెడుతున్న పసికందులను ఆహ్వానిస్తున్నదెవరు? ఈ ప్రశ్నకు ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం సమాధానం చెబుతోంది. మానవ ప్రపంచం సాధించిన అభివృద్ధికంటే ముందే ఆకలి, కరువు, దారిద్ర్యం, అందని చదువులు, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం మున్నగు సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గర్భస్త…

2010 సం.లో ఇండియాలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు

పిల్లలపై అత్యాచారాలు జరపడంలో భారత దేశం పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2010 సంవత్సరంలోనే భారత దేశంలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1408 మంది పిల్లలను చంపేశారని కూడా ఆ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటా కలుపుకుని మొత్తం 10,670 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమో, ఎత్తుకెళ్లడమో చేశారని ఎన్.సి.ఆర్.బి తెలిపింది.…

16 సంవత్సరాల్లో 2.5 లక్షల రైతుల ఆత్మ హత్యలు

భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల…

‘సౌదీ’ దరిద్రంపై వీడియో తీసినందుకు అరెస్టు -కార్టూన్

సౌదీ అరేబియాకు చెందిన ‘ఫెరాస్ బగ్నా’ దేశ పౌరుడుగా ఓ చిన్న ప్రయత్నం చేశాడు. దేశంలో ఉన్న దరిద్రాన్ని వీడియో ద్వారా చూపించి తద్వారా ధనవంతులనుండి విరాళాలు సేకరించి పేదలకు ఇవ్వాలనుకున్నాడు. అనుకన్నదే తడవుగా ఫెరాస్ సౌదీ రాజధాని రియాధ్ లో పేద ప్రాంతాలకు వెళ్ళి వారి ఇళ్ల లోపలి భాగం కూడా చూపించి, వారి ఆర్ధిక పరిస్ధితి గూర్చి వారి చేతనే చెప్పించి ఆ దృశ్యాలతో ఒక వీడియో రూపొందించాడు. తన వంతు బాధ్యతగా తాను…

సౌదీ అరేబియా ‘దరిద్రం’పై వీడియో తీసినందుకు అరెస్టు (+వీడియో)

కొద్ది వారాల క్రితమే మహిళలకు ఓటు హక్కు ఇస్తున్నట్లు ప్రకటించి అరబ్ ఆందోళనలనుండి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సౌదీ అరేబియా రాజు తన నియంతృత్వ పాలనను కొనసాగిస్తూనే ఉన్నాడు. కారు నడిపిన నేరానికి స్త్రీలను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ‘సౌదీ అరేబియా’లో కూడా దరిద్రం తాండవిస్తున్నదనీ, అది కూడా రాజధాని నగరంలోనే ఉన్నదని చూపిస్తూ వీడియో తయారు చేసినందుకు ‘ఫెరాస్ బగ్నా’ అనే పౌరుడిని అరెస్టు చేయించాడు. ‘ఫెరాస్ బగ్నా’ తాను తీసిన వీడియో ఇంటర్నెట్…

రంగులను చూడడంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా -బొమ్మ

ఈ బొమ్మ సైంటిఫిక్ కోణం నుండి గీసినది కాదు. శాస్త్ర పరంగా ఈ బొమ్మ కరెక్టు కాదు. ఇది సామాజిక కోణం నుండి చూస్తూ గీసిన చిత్రం. స్త్రీలు బాగా అలంకరించుకుని అందంగా తయారై అందర్నీ ఆకట్టుకోవలసిన బాధ్యత ఉన్నదని సమాజం నేర్పింది. ఉంటే వంటిల్లు, బైటికొస్తే భర్త పక్కన అందమైన భార్యగా, ఆమె అందాన్ని చూసి ఆమె భర్త పట్ల పలువురు ఈర్ష్య పడేలా ఉండాలని సమాజం వివిధ నియమ నిబంధనల ద్వారా స్త్రీలకు నేర్పింది.…

దళితులైతేనేం? ఆడవాళ్లు ఆడవాళ్ళే!

దళితులకంటే దళితులు స్త్రీలని మరోసారి రుజువైంది. ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్న ఓ ధనిక దళిత కుటుంబం తోటి పేద దళిత మహిళను నగ్నంగా గ్రామంలో ఊరేగించిన దారుణం చోటు చేసుకుంది. కక్ష సాధించే క్రమంలో డబ్బుకీ, రాజకీయ పలుకుబడికీ స్త్రీలే ప్రధమ లక్ష్యమని ఈ సంఘటన మరొకసారి చాటి చెప్పింది. విడాకులు తీసుకున్న తమ కూతురు వేరే యువకుడితో కలిసి గ్రామం నుండి వెళ్ళిపోవడానికి సాయం చేశాడని బాధిత…

హోటల్ మెయిడ్‌తో నా ప్రవర్తన నైతిక పతనమే -స్ట్రాస్ కాన్

ఐ.ఎం.ఎఫ్ మాజి మేనేజింగ్ డైరెక్టర్ స్ట్రాస్ కాన్ జైలునుండి బైటకు వచ్చాక మొదటిసారి నోరు విప్పాడు. హోటల్ మెయిడ్‌పైన తాను బలవంతం చేయనప్పటికీ ఆమెతో తన ప్రవర్తన నా నైతిక పతనమేనని అంగీకరించాడు. “భారత దేశ రాజకీయ నాయకుడు స్ట్రాస్ కాన్ ఉన్న పరిస్ధితిలో ఉన్నట్లయితే, మొత్తం ఘటననే పెద్ద అభద్దం అని బొంకి ఉండేవాడు. అసలు అటువంటిది ఏమీ జరగనే లేదనీ, మెయిడ్‌ని తానసలు ఇంతవరకూ చూడనేలేదనీ అనేక ఒట్లు పెట్టి ఉండేవాడు. కావాలంటే బహిరంగ…

బ్రిటన్ పొదుపు విధానాలతో కుచించుకుపోయిన కుటుంబ బడ్జెట్లు

కొన్ని వందల బిలియన్ల పౌండ్లు అప్పు తెచ్చి బెయిలౌట్ల రూపంలో ప్రవేటు ద్రవ్య సంస్దలను మేపిన బ్రిటన్ ప్రభుత్వం తీరా ఆ అప్పులను తీర్చడానికి ప్రజల పైన భారం వేస్తూ పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మితవాద కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల పొదుపు విధానాల అమలు ప్రభావం బ్రిటిష్ పౌరుల కుటుంబ బడ్జెట్‌లను బాగా కుచించివేసిందని ‘ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్’ చేసిన అధ్యయనంలో…

ఫేస్‌బుక్, ట్విట్టర్… లండన్‌లో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు -కార్టూన్

లండన్ పోలీసుల దృష్టిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఉంది అని ప్రపంచం భావిస్తోంది కనుక ఆగారు కానీ ఈ పాటికి ఈ ఇద్దరు నేరగాళ్ళని లండన్ పోలీసులు పబ్లిక్ లో కనపడకుండా చేసేవారే. జోర్డాన్ బ్లాక్‌షా (20 సం.లు), సట్‌క్లిఫ్ కీనన్ (22 సం.లు) అనే ఇద్దరు యువకులకి లండన్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందేశాలు…

ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్

2012 ఒలింపిక్ ఆటల సంరంభానికి ఇంకా సంవత్సరం మిగిలే ఉంది. ఒలింపిక్ ఆటలు నిర్వహిస్తామని పోటీపడి గెలిచిన లండన్ నగరం అప్పుడే తగలబడిపోతోంది. దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత ఉగ్ర రూపం దాల్చి అల్లర్లై లండన్ నగరాన్ని తగలబెడుతోంది. “లూటీలూ, దహనాలతో మీరు సాధించిందేమిటి?” అని అడిగిన విలేఖరులకి “వేలమందిమి శాంతియుత ప్రదర్శనలు చేసినా అస్సలు పట్టించుకోని మీరు మా దగ్గరికి వచ్చి మరీ ఇప్పుడెందుకా ప్రశ్నని…

నాయకులు, ఉద్యోగులు, పోలీసులు… వీరే ప్రజల దృష్టిలో అత్యంత అవినీతిపరులు -సర్వే

ప్రజలు రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకునో, మద్యం తాగో వారికి ఓట్లు గెలిపించినా ఎవరు అవినీతిపరులన్న విషయంలో వారు స్పష్టంగానే ఉన్నారని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ సంస్ధ నిర్వహించిన “స్టేట్ ఆఫ్ ది నేషన్” సర్వేలో వెల్లడయ్యింది. భారత దేశ వ్యాపితంగా 1300 లొకాలిటీలలో జరిగిన ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో అత్యంత అవినీతిపరులుగా ప్రజలు భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది రాజకీయ నాయకులు అత్యంత అవినీతిపరులుగా…

ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు లోక్ పాల్ గురించి అసలు విననే లేదు -సర్వే

అన్నా హజారే, ఆయన నాయకత్వంలోని పౌర సమాజ కార్యకర్తల బృందం సాగించిన ప్రచారం, కార్యకలాపాలు గత మూడున్నర నెలలనుండి లోక్ పాల్ వ్యవస్ధ గురించిన వార్తలను భారతీయ మీడియా తప్పనిసరిగా ప్రచురించేలా చేశాయి. లోక్‌‌పాల్ అనే వ్యవస్ధ భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో సాతుతున్న అవినీతిని అడ్డుకోవడానికి ఉద్దేశించిందని, అవినీతిపై వాళ్ళ ఆందోళన పతాక శీర్షికలకు ఎక్కేవరకూ చాలా మంది అక్షరాస్యులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మొత్తం మీద చూస్తే భారతీయుల్లో నూటికి అరవై…

‘ఫ్యాషన్ ఐకాన్‌’ గా చిత్రించడంపై ఆగ్రహించిన పాక్ విదేశీ మంత్రి హైనా రబ్బాని

భారత పత్రికలు పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బానీ ఖర్, తనను భారత పత్రికలు ‘ఫ్యాషన్ ఐకాన్’ గా అభివర్ణించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి చోటా పేపరాజ్జీ ఎదురవుతూనే ఉంటుందనీ పత్రికలు అలా వ్యవహరించడం సరికాదని పాకిస్ధాన్ మీడియా వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఆ ప్రశ్న అనంతరం మరో ప్రశ్న వేయడానికి మీడియాకి అనుమతి ఇవ్వకుండా వెళ్ళిపోయేంతగా హైనా రబ్బానీ తనపై వచ్చిన ముద్ర పట్ల ఆగ్రహం చెందింది. ఇటీవల భారత…

మీడియా రారాజు రూపర్డ్ మర్డోక్, మీడియాతోనే ఇబ్బందిపడుతున్న వేళ -కార్టూన్

స్టార్ ఛానెళ్ల అధినేత, “న్యూస్ ఆఫ్ ది వరల్డ్”, “ది సన్” లాంటి టాబ్లాయిడ్ పత్రికలతో బ్రిటన్‌లో అత్యధిక సర్క్యులేషన్ సాధించిన మీడీయా రారాజు రూపర్డ్ మర్డోక్ ఇప్పుడు ఆ మీడియాతోనే ఇబ్బందిపడిపోతున్నాడు. పత్రికకు అగ్ర స్ధానం సంపాదించడానికీ, ఆ తర్వాత అగ్ర స్ధానన్ని నిలబెట్టుకోడానికి అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన రూపర్డ్ మర్డోక్ తాను కూడా అందుకు అతీతుడను కానని అర్ధమై, తన ముఖం ఎలాంటిదో అద్దంలో ప్రతిబింబుస్తుండడంతో అసహనానికి లోనవుతున్నాడు. హత్యకు గురైన బాలిక…