భార్యని కాపాడలేదని డాక్టర్ ని చంపేసిన ఆటో డ్రైవర్

గర్భిణి అయిన తన భార్యని కాపాడలేకపోయిందన్న ఆగ్రహంతో ఇరవేయేడేళ్ల మహేష్ అనే ఆటో డ్రైవర్ ఒక డాక్టర్ ని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. యాభై అయిదేళ్ల డా॥ టి.సేతు లక్ష్మి, తన రోగిని కాపాడడానికి ప్రవేటు ఆసుపత్రికి స్వయంగా అంబులెన్సులో తరలించినప్పటికీ కాపాడలేకపోయింది. డాక్టర్ నిజాయితీని కొంచెమయినా గుర్తించని రోగి భర్త, భార్య చనిపోయిందన్న ఆవేదనతో డాక్టర్ ప్రాణాలు తీయడానికి వెనుకాడకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో వివిధ వర్గాల…

‘అనూజ్ బిద్వే’ హత్య కేసు విచారణ జూన్ లో

ఇంగ్లండులో హత్యకు గురైన అనూజ్ బిద్వే కేసు విచారణ జూన్ నెలలో చేపట్టనున్నారు. జాత్యహంకారంతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న ఈ కేసులో నిందితుడు ఇరవై ఏళ్ళ ‘కియారాన్ స్టేపుల్ టన్’. ఇతను తనను ‘సైకో స్టేపుల్ టన్’ గా పిలవాల్సిందిగా తన మిత్రులను కోరేవాడని తెలుస్తోంది. జూన్ 25, 2012 నుండి కేసులో ట్రయల్స్ ప్రారంభం చెయ్యడానికి కోర్టు నిర్ణయించింది. సాల్ ఫర్డ్ లోని మాంఛెస్టర్ లో అనుల్ బిద్వే తన మిత్రులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా…

బోట్సువానా వీధి చిత్రాలు -ఫొటోలు

ఈ వీధి చిత్ర కారుడి అలియాస్ పేరు ‘ఫెయిత్47’. ఈ వీధి చిత్రాల ‘ధీమ్’ కూడా ‘ఫెయిత్’ లానే ఉంది. ఆఫ్రికా దేశం ‘బోట్సువానా’ లో ‘ఫెయిత్47’ గీసిన వీధి చిత్రాలివి. – – –  

బూతోడుండేది అమెరికాలో, భారత్ లో ఉండేవారి దేశభక్తిపైనే అనుమానాలు

ఈ బూతు వెధవలు ఉండేది అమెరికాలో. ఐనా ఇండియాలో ఉండే వారి దేశ భక్తికి పరీక్షలు పెడుతుంటారు. ఉదాహరణకి వీడిని చూడండి. వీడి ఐ.పి నంబరు: 117.192.199.112. వీడి పేరు needa అట. వీడి ఈ మెయిల్: avasarama@eesuttiki.com సొంత పేరు, సొంత ఈమెయిల్ ఐ.డి చెప్పుకోలేని దౌర్భాగ్యం ఇతన్ది. అందుకే వీడ్ని సన్నాసి అని పిలవాలనిపిస్తోంది. కతార్ లో తాలిబాన్ ఆఫీసు తెరవడం పైన నేను రాసిన ఈ పోస్టు కింద వీడు ఒక పనికిమాలిన…

(90 మంది రోగులను చంపిన) కోల్ కతా ఆసుపత్రి డైరెక్టర్లను వెంటనె విడుదల చేయాలి -ఫిక్కి

డిసెంబరు 9 తేదీన కోల్ కతా లోని ‘ఎ.ఎం.ఆర్.ఐ ధాకూరియా’ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొంభై మందికి పైగా రోగులు, ఉద్యోగులు చనిపోయిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి మమత ప్రమాదానికి వెంటనే స్పందించి ఆసుపత్రి డైరెక్టర్లు పది మందిలో ఏడుగురిని వెంటనే అరెస్టు చేయించింది. వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో కోల్ కతా జైలులోనే ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని భారత పెట్టుబడిదారుల సంఘం “ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్…

డిజిపి వ్యాఖ్య, పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట -కత్తిరింపులు

జనవరి ఒకటో తారీఖున ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. సల్వార్ కమీజ్, చుడీదార్ లు కూడా డిజిపి కి అసభ్య వస్త్ర ధారణగా కనపడడం విపరీతం కాకపోతే ఏమిటి? నిజానికి చీర కంటే, లంగా ఓణి కంటే సల్వార్ కమీజ్ శరీరాన్ని పూర్తిగా కప్పేస్తుంది. అరి చేతులు, అరి కాళ్ళు, తల తప్ప శరీరాన్నంతా చుడీదార్లు కప్పి ఉంచుతాయి. ఐనా ఆ డ్రస్సులు డిజిపి కి రెచ్చగొట్టేలా ఎలా కనపడ్డాయి? ఈ వ్యాస…

మరో భారతీయ విద్యార్ధి హత్య, ఈసారి కెనడాలో

బ్రిటన్ లో అనిల్ బిద్వే హత్యకు గురైన కొన్ని రోజులకే మరో భారతీయ విద్యార్ధి హత్యకు గురయ్యాడు. ఈసారి వంతు కెనడా తీసుకుంది. ఇరవే యేడేళ్ళ ‘అలోక్ గుప్తా’ కెనడాలో తుపాకితో కాల్చి చంపబడ్డాడు. పశ్చిమ కెనడాలో సర్రే నగరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఒక స్టోర్ యజమానులు అందరూ కలిసి క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడానికి వీలుగా అలోక్ గుప్తా మధ్యాహ్నం షిఫ్టు పని…

అన్నా హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ -1

అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత,…

“కూరగాయల్లో కూరగాయనై…,” వేనిషింగ్ ఆర్ట్ -ఫొటో

చూడబోతే ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ లా ఉంది గాని నిజానికి కాదు. “లు బోలిన్” అనే చైనా కళాకారుడు ప్రదర్శిస్తున్న కళ ఇది. తన వొంటి పైన కూరగాయలను చిత్రించుకుని బీజింగ్ లోని ఓ సూపర్ మార్కెట్ లో కూరగాయలున్న షెల్ఫ్ ముందు నిజంగానే నిలబడి ఉన్నాడు. నవంబరు 10, 2011 తేదీన లు, ఈ చిత్ర కళను ప్రదర్శించాడు. “అదృశ్యమయ్యే కళాకారుడు” (వేనిషింగ్ ఆర్టిస్ట్) గా పేరు పొందిన ‘లు బోలిన్’ ఆరు సంవత్సరాలుగా ఇలా…

పురుషాధిక్య సమాజంలో పురుషులపై జరిగే అన్యాయాలపై అవగాహన

మిత్రులొకరు పురుషులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏమి చెబుతారు? అని అన్నా గారి గొడ్రాలి వ్యాఖ్యపైన నేను రాసిన పోస్టు కింద అడిగారు. దానికి సమాధానం రాశాను. అది పోస్టుగా చేయగల విషయం అని భావించి ఇక్కడ ఇస్తున్నా. *                              *                         *                              * స్త్రీలకు జరుగుతున్న అన్యాయం నేరుగా పురుషులనుండి జరుగుతుందని భావిస్తే ఈ అనుమానం రావడం సహజం. కాని వాస్తవం ఏమిటంటే, పురుషులకు, స్త్రీలపైన ఆధిపత్యం సమాజం ఇచ్చింది. అంటే సమాజం స్వభావాన్ని బట్టే…

‘భగవద్గీత’ నిషేధానికి రష్యా కోర్టు నిరాకరణ

భారత ప్రభుత్వం రాయబార పరంగా తెచ్చిన ఒత్తిడి ఫలించిందో ఏమో గానీ ‘భగవద్గీత’ అనువాద గ్రంధం నిషేధానికి రష్యాలోని సైబీరియా కోర్టు నిరాకరించిందని పి.టి.ఐ వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. సైబీరియాలోని టామ్స్క్ జిల్లా కోర్టులో గత జూన్ నెలలో ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని పి.టి.ఐ నివేదించింది. గత కొన్ని వారాలుగా ఈ అంశంపై రష్యా, భారత్ ల మధ్య రాయబార పరమైన ఒత్తిడి కొనసాగుతూ వచ్చింది. పార్లమెంటులో సైతం…