ఇద్దరు లెజెండ్ ఆటగాళ్ళు కలుసుకున్న వేళ -ఫోటోలు
సచిన్ టెండూల్కర్, రోజర్ ఫెదరర్, ఇద్దరూ వారి ఆటల్లో ఉన్నత స్ధానాలకు చేరుకున్నావారు. అయినా ఆటల దాహం తీరక ఇంకా ఇంకా సాధించాలని తపిస్తున్నవారు. తపించడమే కాక శ్రమిస్తున్నవారు. వీరిద్దరూ కలుసుకుంటే, ఆ క్షణాలు వారిద్దరికే కాదు వారిని ఆరాధించే అభిమానులకు కూడా కన్నుల పండుగే. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్ కలుసుకున్న అపురూప క్షణాలివి.