ఎయిర్టెల్ జాబ్ నుండి గ్రామ సర్పంచ్ గిరీకి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చేసిన వారంతా రెండు సంవత్సరాల పాటు గ్రామాల్లో వైద్యం చేస్తేనే డిగ్రీ చేతికి ఇస్తామని ప్రకటించినపుడు మెడికల్ విద్యార్ధులు ఆ నిబంధనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడం చూశాం. ఇండియాలో ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యాసంస్ధలలో భారత ప్రజల డబ్బుతో చదువుకొని కోట్ల కొద్ది జీతాల కోసం అమెరికా వాల్ స్ట్రీట్ కంపెనీల ఉద్యోగాల కోసం పరిగెత్తే విద్యాధికులను చూశాం. ఇంజనీర్లు, డాక్టర్లైతే చాలు ఎప్పుడు…

అణు ధార్మికత ఎంత దాటితే ప్రమాదకరం?

అణు ధార్మికతను ‘మిల్లీ సీవర్టు’లలో కొలుస్తారు. ‘సీవర్టు’ అసలు యూనిట్ అయినప్పటికీ అత్యంత ప్రమాదకర స్ధాయి సైతం మిల్లీ సీవర్టులలో ఉంటుంది కనుక ‘మిల్లీ సీవర్టు’ సాధారణ కొలతగా మారింది. జపాన్ ఛీఫ్ కేబినెట్ మంత్రి యుకియో ఎదనో చెప్పినదాని ప్రకారం ఫుకుషిమా దాయిచి అణు విద్యుత్ కేంద్రం వద్ద అణు ధార్మికత గంటకు 400 మిల్లీ సీవర్టులుగా నమోదయ్యింది. ఇది మంగళవారం ఉదయం నెం.2 రియాక్టర్ పేలడానికి ముందు నమోదైనదాని కంటే కొన్ని వేల రెట్లు…