మంగళవారం కూడా పతనమైన భారత షేర్ మార్కెట్లు, తొలగని అనిశ్చితి
భారత షేర్ మార్కెట్లు మంగళవారం కూడా పతనమయ్యాయి. అమెరికా రుణ సంక్షోభం దరిమిలా ఎస్&పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడంతో సోమవారం ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు భారీగా నష్టపోయీన సంగతి తెలిసిందే. మంగళవారం భారత షేర్లు విపరీతమయిన ఎగుడుదిగుడులకు గురయ్యాయి. దాదాపు 1600 పాయింట్ల మేరకు గత ఐదు రోజులుగా ఉత్ధాన పతనాలకు గురైన భారత షేర్లు ప్రారంభంలో సోమవారం నాటి ధోరణిని కొనసాగిస్తూ భారిగా పతనమైన సూచిలు మధ్యాహ్నానికి కోలుకుని లాభాల బాట…