జి20 సమావేశాలు మొదలు, రేపటికల్లా శుష్క వాగ్దానాల వరద
జి20 గ్రూపు దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశం వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యింది. అమెరికా, యూరప్‌ల రుణ సంక్షోభాలు ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక వ్యవస్ధలను, షేర్ మార్కెట్లను వణికిస్తున్న నేపధ్యంలో జి20 సమావేశాలు జరుగుతున్నాయి. 1990ల చివర్లో జి20 గ్రూపు ఏర్పడినప్పటికీ మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో దాని ప్రాధాన్యత పెరిగింది. సంక్షోభం ప్రారంభంలో వరుసగా సమావేశాలు జరిపిన జి20 గ్రూపు, ట్రిలియన్ల కొద్దీ డాలర్ల స్టిములస్ ప్యాకేజీలు ప్రకటించి ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యం నుండి…