ఎర్ర సూర్యుడి నుదుట ‘శుక్ర’ తిలకం -ఫొటోలు
మరో వందేళ్లకు గాని సంభవించని ఖగోళ అద్భుతం జూన్ 5, 6 తేదీలలో ప్రపంచ ప్రజలకు దర్శనం అయింది. ఎనిమిది సంవత్సరాల తేడాతో సూర్య తలంపై జంట మార్గాల్లో ప్రయాణం చేసే శుక్ర గ్రహం ఎనిమిదేళ్ల క్రితం జూన్ 8, 2004 తేదీన మొదటి ప్రయాణం పూర్తి చేసుకుంది. మళ్ళీ ఎనిమిదేళ్లకు రెండవ ప్రయాణం పూర్తి చేసింది. (భూగ్రహ వాసుల కంటిని రిఫరెన్స్ గా తీసుకున్నందున ఇక్కడ జంట ప్రయాణాలుగా ఉపమానీకరించడం.) మామూలు జనానికి ఇదేమీ పెద్ద…
