ఉక్రెయిన్ సంక్షోభం -టైమ్ లైన్

ఉక్రెయిన్ సంక్షోభం కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం అయింది కాదు. ఇ.యు తో చేసుకోవాలని భావించిన ‘అసోసియేషన్ ఒప్పందం’ ను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించింది లగాయితు మొదలయిన ఆందోళనలు, సంక్షోభం నిజానికి రెండు ప్రపంచ ధృవాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోటీ. ఈ పోటీలో అమెరికా నేతృత్వంలోని పశ్చిమ కూటమి ఒకవైపు నిలబడగా రష్యా నేతృత్వంలోని యూరేసియా కూటమి మరోవైపు నిలబడి ఉంది. పాత్రధారులు ఉక్రెయిన్ ప్రజలే అయినా వారిని నడిపిస్తున్నది…

అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం

(ఈ లేఖను సెప్టెంబర్ 11 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సిరియా తిరుగుబాటుదారులు ఆగస్టు 21 తేదీన సౌదీ అరేబియా అందించిన రసాయన ఆయుధాలు ప్రయోగించి వందలాది మంది పౌరులను బలిగొన్న దుర్మార్గాన్ని సిరియా ప్రభుత్వంపై మోపి ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడుతున్న నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ లేఖ రాశాడు. లేఖ రాసేనాటికి సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలోకి తేవడానికి రష్యా ప్రతిపాదించడం, సిరియా అందుకు అంగీకరించడం జరిగిపోయింది. అమెరికా…

అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి…

బొలీవియాకు స్పెయిన్ బహిరంగ క్షమాపణ

బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంలో అనుమతి నిరాకరించడం జరగనేలేదని వాదించిన స్పెయిన్ ఎట్టకేలకు బహిరంగ క్షమాపణ చెప్పింది. మాస్కో నుండి బొలీవియా ప్రయాణిస్తున్న బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ విమానానికి ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ దేశాలు అనుమతి నిరాకరించడంతో అది అత్యవసరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో దిగవలసి వచ్చింది. ప్రపంచ ప్రజలపై అమెరికా అక్రమ గూఢచర్యం వివరాలను వెల్లడించిన ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ విమానంలో ఉన్నాడన్న అనుమానంతో సి.ఐ.ఏ ఇచ్చిన…

స్నోడెన్ మావద్దే ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్లొచ్చు -పుటిన్

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ రహస్య ‘హక్కుల ఉల్లంఘన’ను బైట పెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తమ వద్దే ఉన్నాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ కుండ బద్దలు కొట్టారు. ఆయన స్వేచ్ఛా జీవి అనీ, తాను కోరుకున్న చోటికి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని పుటిన్ స్పష్టం చేశారు. స్నోడెన్ ను అమెరికాకు అప్పగించే ఆలోచనేదీ తమకు లేదని కూడా పుటిన్ తెలిపారు. “స్నోడెన్ మాస్కో వచ్చిన మాట నిజం. ఆయన రాక మాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ట్రాన్సిట్…

స్నోడెన్ కి షెల్టర్ ఇచ్చారా, జాగ్రత్త! అమెరికా హెచ్చరిక

అమెరికా తన సామ్రాజ్యవాద దురహంకార స్వభావాన్ని ఎటువంటి శషభిషలు లేకుండా మరోసారి చాటుకుంది. సి.ఐ.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ హాంగ్ కాంగ్ వీడి రష్యా వెళ్ళిన నేపధ్యంలో ఆయనకు ఏ దేశమూ షెల్టర్ ఇవ్వడానికి వీలు లేదని హెచ్చరించింది. విద్రోహ నేరం కింద అమెరికాలో ఆయనపై కేసులు నమోదయ్యాయని కాబట్టి ఏ దేశమూ ఆయనకు రక్షణ ఇవ్వడం గానీ, తన గగనతలం గుండా ప్రయాణించే అవకాశం కల్పించడం గానీ చేయరాదని అమెరికా అధికారి ఒకరు హెచ్చరించినట్లు…