బళ్లారి ఇనుప ఖనిజ తవ్వకాలతో పర్యావరణ హాని, తవ్వకాలను సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు
ఇనుప ఖనిజాన్ని విచక్షణా రహితంగా తవ్వి తీస్తుండడం వలన పర్యావరణానికి తీవ్ర హాని సంభవిస్తున్నదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక సపర్పించడంతో బళ్లారిలో ఇనుప ఖనిజ తవ్వకాలను సస్పెండ్ చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. “తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ బళ్లారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను నిలిపివేయాలని ఈ కోర్టు భావిస్తునది” అని ఛీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ అవసరాలు తీర్చడానికి…