మాకీ యుద్ధం వద్దు బాబోయ్ -ఉక్రెయిన్ మహిళలు (వీడియో)
తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల మీద అమానుషంగా దాడి చేస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం ఉక్రెయిన్ యువకులను బలవంతంగా యుద్ధ క్షేత్రానికి తరలిస్తోంది. ఉక్రెయిన్ సైన్యాలు ఫైటర్ జెట్ లతో ఇళ్ళు, భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, కాలేజీలు… ఇలా కనపడిందల్లా కూల్చివేస్తుండడంతో డొనేట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాలు తీవ్రమైన మానవతా సంక్షోభం (humanitarian crisis) లో ఉన్నాయి. పెద్ద మొత్తంలో ప్రజలు సరిహద్దు దాటి శరణార్ధులుగా రష్యాకు తరలిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తూర్పు ఉక్రెయిన్, ఉక్రెయిన్ కు మరో గాజా…



