సిరియాపై ఆయుధ నిషేధం ఎత్తివేసిన ఐరోపా

తాను చెప్పిన నీతిని తానే అడ్డంగా ఉల్లంఘించింది యూరోపియన్ యూనియన్. రెండేళ్ల క్రితం సిరియాలో హింస చెలరేగినందున ఆయుధ సరఫరా మరింత హింసను ప్రేరేపిస్తుందన్న కారణం చెబుతూ సిరియాపై ఆయుధ నిషేధాన్ని (arms embargo) యూరోపియన్ యూనియన్ విధించుకుంది. ఇపుడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎత్తివేతతో సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు యధేచ్ఛగా, బహిరంగంగా ఆయుధాలు సరఫరా చేసుకునే అవకాశం ఐరోపా దేశాలకు వస్తుంది. ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలకు లాభాలు పెంచి, వెంటిలేషన్ పై ఉన్న…