వాల్-మార్ట్ కంపెనీ విస్తరణకి వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది. “(వాల్-మార్ట్ వల్ల)…

‘వాల్ మార్ట్’ స్టోర్ ని తగలబెడతా -ఉమా భారతి

వాల్ మార్ట్ లాంటి బహుళజాతి రిటైల్ కంపెనీలు భారత దేశంలో షాపులు పెట్టినట్లయితే వాటిని స్వయంగా తగలబెడతానని బి.జె.పి నాయకురాలు ఉమా భారతి ప్రకటించింది. భారత దేశంలో ఎక్కడ షాపు పెట్టిన తక్కడికి తన కార్యకర్తలతో వెళ్ళి తగలబెడతానని ఆమె ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారత దేశ చిల్లర అమ్మకాల (రిటైల్) రంగంలోకి అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగిల్ బ్రాండ్ రంగం లో వందశాతం, మల్టీ బ్రాండ్ రంగంలో 51 శాతం…

చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం

ప్రపంచ వ్యాపితంగా వ్యాపారాలు చేస్తున్న అతి పెద్ద చిల్లర సరుకుల అమ్మకం దారులు (రిటైల్ అమ్మకాలు సాగించే సూపర్ మార్కెట్లు) వాల్ మార్డ్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీలను భారత దేశంలోకి అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కోసం అనేక సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు భారత దేశంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. భారత దేశ దళారీ పాలకులు, దళారి కంపెనీల తృప్తికి సరిపడా బేరాలు కుదరలేదేమో, ఇన్నాళ్ళూ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు…