లోక్‌పాల్ బిల్లుకి187 సవరణలా!? ఆమోదనీయం కాదు -చిదంబరం

ఒకటి రెండు సవరణలైతే ఆమోదించవచ్చనీ, రాజ్యసభలో ఏకంగా నూట ఎనభై ఏడు సవరణలు లోక్ పాల్ బిల్లుకి ప్రతిపాదించడం ఆమోదయోగ్యం కాదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం శనివారం వ్యాఖ్యానించాడు. మిత్రుల మద్దతు పొందడానికి ఒకటి రెండు సవరణలు బిల్లుకి చేయవచ్చనీ చిదంబరం తెలిపాడు. “లోక్ పాల్ బిల్లుని మెరుగుపరిచి పురర్నిర్వచించవలసిన అవసరం రావచ్చు. రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి సంబంధించినంతవరకూ ఒకటి రెండు సవరణలను అనుమతించవచ్చు. ఒకటి రెండు సవరణలు చేసినా అదే బిల్లు…

‘మమత’ సవరణలతో లోక్ పాల్ బిల్లు బడ్జెట్ సమావేశాలకి వాయిదా పడే ప్రమాదం

రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. యు.పి.ఎ భాగస్వామి త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రతిపాదించిన సవరణలకు ప్రతిపక్ష పార్టీలలో కూడా మద్దతు దొరకడంతో ప్రస్తుత సమావేశాలలో లోక్ పాల్ బిల్లు ఆమోదం కష్టంగా కనిపిస్తోంది. బిల్లుకు తలపెట్టిన సవరణలతో సహా, లోక్ పాల్ బిల్లు, మరొకసారి స్ధాయీ సంఘం పరిశీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. చూడగా, ఎన్.డి.టి.వి విశ్లేషణ అంతిమంగా నిజమయ్యేలా పరిస్ధితి కనిపిస్తోంది. రాష్ట్రాలు…

‘టీం అన్నా’ ఆందోళనను ను తూర్పారబట్టిన బోంబే హై కోర్టు

టీం అన్నా శుక్రవారం అనూహ్య రీతిలో బోంబే హై కోర్టు నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. తమ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమే అని గట్టిగా నమ్ముతున్న టీం అన్నా బృందానికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “మీ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమేనని కోర్టు నిర్ణయించలేదు. మీరు జరుపుతున్న ఆందోళన మీకు ‘సత్యగ్రహం’ కావచ్చు. ఇతరులకు అది ‘న్యూసెన్సు’ కావచ్చు” అని కోర్టు అన్నా బృందం వాదనలను తిరస్కరించింది. బోంబే హైకోర్టు వ్యాఖ్యలు అన్నా బృందానికి…

జన్ (రాజీవ్) లోక్ పాల్ బిల్లు -కార్టూన్

‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది…

ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లుని 80 శాతం సవరించవచ్చు -స్టాండింగ్ కమిటీ సభ్యుడు

“స్టాండింగ్ కమిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంద”ని సోమవారం ప్రకటించిన స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మంగళవారం అలాంటిదే మరో కబురు చెప్పాడు. ప్రభుత్వం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లులో 80 శాతం సవరణలు చేయవచ్చునని ప్రకటించాడు. అన్ని వర్గాలవారూ కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కనపరచాలని స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్ సింఘ్వీ అన్నాడు. వ్యక్తిగత, ప్రజా సమస్యలు మరియు చట్టం, న్యాయం విషయాలలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నాయకుడు అభిషేక్…

ప్రభుత్వానికీ, అన్నా బృందానికి మద్య తలెత్తిన ప్రధాన విభేదాలు ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం తన లోక్ పాల్ బిల్లుని రూపొందించుకుని కేబినెట్ లో ఆమోదింపజేసుకుంది. అన్నా హజారే బృందం ముందుకు తెస్తున్న జన్ లోక్ పాల్ డ్రాఫ్టులోని అనేక అంశాలు తమ డ్రాఫ్టులో పొందుపరిచామని చెప్పుకుంది. ప్రభుత్వం తయారు చేసిన బిల్లుని చూసిన అన్నా బృందం దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. కోరలు లేని బిల్లుని తెచ్చారనీ, అది దేశ ప్రజలపై విసిరిన ఓ పెద్ద జోక్ అనీ చెబుతూ తిరస్కరించారు. తాను ముందే హెచ్చరించినట్లుగా అమరణ నిరాహార దీక్షకు…

అవినీతి వ్యతిరేక ఉద్యమం ముందు పార్లమెంటు అధికారం ఏపాటిది? -కార్టూన్

అన్నా హజారే, ఆయన మిత్ర బృందంపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ చట్టాలు చేసే హక్కుని తమ చేతుల్లోకి లాక్కుంటున్నారని. ఎంతో కష్టపడి ప్రజల ఆమోదాని సంపాదించి పార్లమెంటులోకి వస్తే, ఆ పార్లమెంటు అధికారం ముందు ఓ ముసలోడు ఎదురొడ్డి నిలవడం ఏమిటన్నది వారి ప్రశ్న. అన్నా హజారే వెనుక జనం, అవినీతిపై వారి వ్యతిరేకతా బలంగా ఉండబట్టి గానీ లేదంటే బాబా రాందేవ్ కి పట్టిన గతే ఆయనకీ పట్టి ఉండేది. పార్లమెంటు సభ్యులు తమకు ప్రజలు…

రాహుల్ జోక్యంతో విడుదల ఉత్తర్వులు, విడుదలకు నిరాకరిస్తున్న హజారే

అన్నా హాజారే అరెస్టు పాలక కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలనే సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో పాత నెహ్రూవియన్ విధానాలకీ, గత రెండు సంవత్సరాలుగా వేళ్ళూనుకున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాల రూపకర్తలకూ మధ్య గల విభేధాలు అన్నా హజారే నిరాహార దీక్ష సందర్భంగా మరొక్కసారి వెల్లడయ్యాయి. అన్నా హజారేని ఉదయాన్నే అరెస్టు చేయించిన చిదంబరం, మన్మోహన్ ల ముఠా తీరా అరెస్టు చేసాక తలెత్తిన వ్యతిరేకతతో డంగైనట్లుగా కనిపిస్తున్నది. హజారే బృందాన్ని అరెస్టు చేశేవరకూ అనుకున్నట్లు సాగినా వారిని…

అన్నా హజారే అరెస్టుపై దేశ వ్యాపిత స్పందన -ఫోటోలు

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలనీ, లోక్ పాల్ పరిధిలోనికి ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పౌర సమాజ కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టడంతో పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. బెయిల్ కోసం పోలీసులు విధించిన షరతులను నిరాకరించడంతో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషణ్, కిరణ్ బేడీ లను కోర్టు ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ పరిణామాల క్రమంలొ దేశవ్యాపితంగా…

ఏ ముఖం పెట్టుకుని ఆగష్టు 15న జాతీయ జెండా ఎగరేస్తారు? -ప్రధానికి హజారే ప్రశ్న

“మా నిరసనను తెలియజేయడానికి అనుమతిని నిరాకరించడం ద్వారా, మీరూ మీ ప్రభుత్వమూ మా మౌలిక హక్కులను ఉల్లంఘించడం లేదా? దేశా స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందే మా స్వాతంత్ర్యాన్ని మీరు లాగేసుకోవడం లేదా? ఏ మొఖం పెట్టుకుని 65 వ స్వాతంత్ర్య దినం రోజున జాతీయ జెండా ఎగరేస్తారు?” తూటాల్లా తాకుతున్న ఈ ప్రశ్నలు భారత దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే రాసిన లేఖలో వేసిన ప్రశ్నలు.…

ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన అన్నా హజారే, మరోసారి ఆమరణ నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వ వైఖరితో అన్నా హజారే విసుగు చెందాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి ఏప్రిల్ లో ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే, మరునాటి నుండే పౌర సమాజ కార్యకర్తలపై కేంద్ర మంత్రులు వివిధ ఆరోపణలతో దాడి ప్రారంభించడంతో ఖిన్నుడయ్యాడు. శాంతి భూషణ్, ఆయన కొడుకు ప్రశాంత్ భూషన్ ఇరువురూ కమిటీలో ఉండడం పట్ల మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు తర్వాత శాంతి భూషణ్ పై అవినీతి ఆరోపణను ఎక్కడో పాతాళం నుండి…

“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే

చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని…