నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి (అన్నాపై విమర్శలు…. -2)

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి నిజానికి జాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయ స్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం ముఖ్య కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలో గల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలో ప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారం…

ముంబై తో పాటు ఢిల్లీ కూడా విస్మరించిన ‘అన్నా పిలుపు’

‘పటిష్టమైన లోక్ పాల్ బిల్లు’ తేవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్నా ఇచ్చిన ఆందోళన పిలుపును ఈసారి ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. గతంతో పోలిస్తే ప్రజలు ఆన్నా ఆందోళనకు అంత తీవ్రంగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందాక తమ ఆందోళన ఎన్నికల సంస్కరణలపై కేంద్రీకరిస్తుందని ప్రకటించిన అన్నా బృందం, అప్పటికి ఎంతమంది ప్రజలను ఆకర్షించగలుగుతారన్నదీ ఇపుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం తలపెట్టిన ‘బలహీన’ లోక్ పాల్ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన జరపాలని…

అన్నా దీక్ష చేసుకోదలిస్తే చేసుకోనివ్వండి, అది మా సమస్య కాదు -ప్రణబ్, ఖుర్షీద్

ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది. మంత్రులు ప్రణబ్…

అన్నా అరెస్టు, లోక్‌పాల్ బిల్లు లపై రెండు కార్టూన్లు

జైలులో ఉండవలసినవారు సమాజంలో సంచరిస్తుంటే, సమాజం బాగు కోసం సమాజంలో ఉండవలసినవారు జైలులో మగ్గుతున్నారని అనేక మంది పెద్దలు అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వాల చర్యలు, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నా హజారే, ఆయన స్నేహితుల అరెస్టుతో అది మరొకసారి రుజువయ్యింది. “మనకంటే ప్రమాదకరమైన వాళ్ళని ఉంచడానికి జైలులో ఖాళీ లేదట!“ ————————————————— కోరలు లేని లోక్‌పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. శక్తివంతమైన బిల్లుని తెమ్మని అన్నా హాజారే బృందం…

పారిన కాంగ్రెస్ పాచిక? ఆరోపణలపై అన్నా హజారే భీషణ భీష్మ ప్రతిజ్ఞ

అన్నా హజారే పై కాంగ్రెస్ విసిరిన పాచిక పని చేస్తోందా? అవినీతి, లోక్ పాల్ బిల్లుల చుట్టూ తిరిగిన అన్నా హజారే పత్రికా సమావేశాలు కాంగ్రెస్ ఆరోపణలతో ఆవేశపూరితుడై ఒకింత ఆవేదనా పూరితుడై పట్ట కూడని బాట పట్టాడనిపిస్తోంది. “ప్రభుత్వం జన్ లోక్ పాల్ బిల్లునే పార్లమెంటులో ఆమోదించినా నా దీక్ష విరమించేది లేదు. నాపైన ఆరోపణలు చేస్తున్నారు కదా! నాకు వ్యతిరేకంగా ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసి విచారణ అయినా జరపాలి. లేదా నాపై ఆరోపణలు నిజం…

ఆగష్టు 16 దీక్షపై గుబులు? అన్నా హజారే పై కాంగ్రెస్ ముప్పేట దాడి!

ఆగష్టు 16 న లోక్‌పాల్ బిల్లుపై హజారే చేస్తానంటున్న నిరవధిక నిరాహార దీక్ష తేదీ దగ్గరు పడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు, సచివులలో కూడా గుబులు పుట్టిస్తోంది. ఇన్నాళ్ళూ సామ, భేదో పాయాల్లో హజారేతో వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు అంతిమంగా దండోపాయానికి దిగిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో రాజకీయ నాయకులు, అధికారులు పాల్పడే అవినీతిని విచారించడానికి సమర్ధవంతమైన లోక్‌పాల్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని అన్నా హాజారే నేతృత్వంలోని సామాజిక కార్యకర్తల బృందం…

ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు లోక్ పాల్ గురించి అసలు విననే లేదు -సర్వే

అన్నా హజారే, ఆయన నాయకత్వంలోని పౌర సమాజ కార్యకర్తల బృందం సాగించిన ప్రచారం, కార్యకలాపాలు గత మూడున్నర నెలలనుండి లోక్ పాల్ వ్యవస్ధ గురించిన వార్తలను భారతీయ మీడియా తప్పనిసరిగా ప్రచురించేలా చేశాయి. లోక్‌‌పాల్ అనే వ్యవస్ధ భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో సాతుతున్న అవినీతిని అడ్డుకోవడానికి ఉద్దేశించిందని, అవినీతిపై వాళ్ళ ఆందోళన పతాక శీర్షికలకు ఎక్కేవరకూ చాలా మంది అక్షరాస్యులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మొత్తం మీద చూస్తే భారతీయుల్లో నూటికి అరవై…