లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

లిబియాలో దాడులు ప్రతిదాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

బుధవారం ఆయిల్ పట్టణమయిన బ్రెగాపై విమాన దాడులు నిర్వహించి గడ్డాఫీ బలగాలు కొన్ని గంటల పాటు స్వాధీన పరచుకున్నప్పటికీ తిరుగుబాటుదారులు ప్రతిదాడితో మళ్ళీ పట్టణాన్ని వశపరచుకున్న సంగతి విదితమే. బ్రెగా పట్టణాన్ని తిరిగి కైవశం చేసుకున్నామన్న ఆనందంలో తిరుగుబాటుదారులు ఉండగానే గడ్డాఫీ బలగాలు గురువారం మరొకసారి బ్రెగా పట్టణంపై విమానాలనుండి బాంబులు జారవిడిచారు. ఆయిల్ కంపినీకి పౌరుల ఆవాసాలకు మధ్య బాంబులు పడినట్లుగా తిరుగుబాటుదారులు తెలిపారు. బ్రెగాపై బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే అజ్దాబియా…