‘గాలి’ సొమ్ము లాయర్లకు బహు తీపి

అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ‘గాలి’ జనార్ధన రెడ్డి గారి సొమ్ము అంటే బెంగుళూరు లాయర్లకు ఎంత ఇష్టమో బెంగుళూరు కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘటనలు వెల్లడించాయి. బెంగుళూరు కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో విచారణకు హాజరయిన ‘గాలి జనార్ధన రెడ్డి’ ని మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటో తీయకుండా అడ్డుకోవడానికి వారు పెద్ద యుద్ధమే చేశారు. గుంపులు గుంపులు గా మీడియా ఫోటో గ్రాఫర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాకపోవడంతో వారిపై రాళ్ళ దాడికి కూడా…