తప్పుడు ప్రచారం చేసినందుకు ‘రీబాక్’ బూట్ల కంపెనీపై $25 మిలియన్ వడ్డన

ఇది అమెరికాలో సంగతి. తమ బూట్లు ధరించి వ్యాయామం చేసినట్లయితే ఇతర బూట్లు ధరించినవారి కంటే వేగంగా ఫిట్‌నెస్ సాధిస్తారని ‘రీబాక్’ బూట్ల కంపెనీ ప్రచారం చేసినందుకుగాను అమెరికా ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ దానిపైన 25 మిలియన్ డాలర్ల పెనాల్టీని వడ్డించింది. రీబాక్ కంపెనీ, ఫెడరల్ ట్రెడ్ కమిషన్ (ఎఫ్.టి.సి) లు పరస్పర అంగీకారం మేరకు ఈ వడ్డన అమలు చేస్తారు. వినియోగదారులకు చేసే చెల్లింపులకు దీనిని ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఎఫ్.టి.సి, రీబాక్ కంపెనీ ప్రచారంపైన…