బహ్రెయిన్ ఆందోళనకారులపై ఉక్కుపాదం
మరిన్ని ప్రజాస్వామిక హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై బహ్రెయిన్ ప్రభుత్వం కఠినంగా అణచివేస్తున్నది. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జి చేయటమే కాకుండా కాల్పులు కూడా జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు చనిపోయారు. మరొకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా గాయపడ్డారు. హెచ్చరికలేమీ లేకుండా లాఠీ చార్జీ చేసి కాల్పులు జరిపినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. శాంతి బధ్రతల కోసం చర్యలు అనివార్యమయ్యాయనీ, చర్చల ద్వారా నచ్చ జెప్పటానికి అన్ని ద్వారాలు మూసుకు…