నేనున్నా లేకున్నా ఈ జ్యోతిని ఆరనివ్వకండి -తీహార్ వద్ద అన్నా

“నేనిక్కడ ఉన్నా లేకున్నా మండుతున్న ఈ జ్యోతిని మాత్రం ఆర్పకండి. భారత దేశం అవినీతి బంధనాలను తెంచుకునేవరకూ ఈ జ్యోతి మండుతూనే ఉండాలి” తీహార్ జైలునుండి బైటికి వచ్చిన అనంతరం తనను చూడడానికి, ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన వేలమంది మద్దతుదారులను చూసి, ఉద్వేగభరితుడైన అన్నా హజారే అన్న మాటలివి. ఇంతకుమున్నెన్నడూ లేని రీతిలో ప్రజానీకం అన్నా హజారేను జైలునుండి వెలుపలికీ ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో హాజరైనారు. మూడు రోజుల పాటు జైలులో గడిపిన హజారే, శక్తివంతమైన లోక్…

నిరవధిక నిరాహార దీక్ష కాదు, ఆరోగ్యం అనుమతించేవరకే

జన్ లోక్ పాల్ బిల్లు ను పార్లమెంటు ముందుకు తేవాలంటూ అన్నా హజారే తలపెట్టిన దీక్ష “నిరవధిక నిరాహార దీక్ష కాదనీ, అన్నా ఆరోగ్యం అనుమతించే వరకే” ననీ పౌర సమాజ కార్యకర్తలు ఢిల్లీ పోలీసులకు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ “నిరవధిక నిరాహార దీక్ష” (ఆమరణ నిరాహార దీక్ష కాదు) అని ప్రకటిస్తూ వచ్చిన అన్నా బృందం తమ నిర్ణయాన్ని మార్చుకున్నారా లేక మొదటినుండీ అదే ఉద్దేశ్యమా అన్నది తెలియరాలేదు. అన్నా హజారే బృందం, ఢిల్లీ పోలీసుల…

రెండు వారాల దీక్షకు ఒప్పందం, గడువు ముగిశాక సమీక్ష

జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకి తేవాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష తలపెట్టిన అన్నా హజారే దీక్ష గడువు విషయంలో బుధవారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు జరిగాయి. మూడు రోజుల గడువునుండి ఐదురోజులకూ, అటు పిమ్మట వారానికీ గడువు పెంచినప్పటికీ హజారే బృందం తిరస్కరించడంతో పోలీసులు అన్నా బృందానికి నచ్చజెప్పటానికి తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి రెండు వారాల పాటు దీక్షను అనుమతించడానికి పోలీసులు, అన్నా హజారే బృందం అంగీకరించారు. అయితే రెండు వారాల…