అమెరికా అణు ప్లాంట్ల వద్ద ఇపుడున్న భద్రతా ఏర్పాట్లు సరిపోవు -టాస్క్ ఫోర్స్

జపాన్‌లొ మార్చిలో సంభవించిన భూకంపం సునామీల వలన ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత అమెరికా ప్రభుత్వం తమ అణు కర్మాగారాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అణు నియంత్రణ కమిషన్‌ (న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ – ఎన్.ఆర్.సి) ను ఆదేశించింది. ఎన్.ఆర్.సి అందుకోసం నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ని నియమించింది. టాస్క్ ఫోర్స్ తయారు చేసిన నివేదికను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ సంపాదించగా ‘ది హిందూ’ పత్రిక అందులో కొన్ని అంశాలను…

పాక్‌కి అమెరికా సాయం నిలిపివేయడాన్ని ఆహ్వానించిన ఇండియా

పాకిస్ధాన్‌కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేయడం పట్ల భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను ఆహ్వానిస్తున్నట్లు ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ప్రకటించాడు. అమెరికా అందజేసే ఆయుధాలవలన ఈ ప్రాంతంలో ఆయుధాల సమతూకాన్ని దెబ్బతీసి ఉండేదని ఆయన అన్నాడు. “ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా, ఈ ప్రాంతాన్ని అమెరికా భారీగా ఆయుధమయం చేయడం వాంఛనీయం కాదని ఇండియా మొదటినుండి చెబుతున్న నేపధ్యంలో, ఆయుధీకరణ…

గూఢచారుల బహిష్కరణతో పాక్‌పై అమెరికా కక్ష సాధింపు, $800 మిలియన్ల సాయం నిలిపివేత

పాకిస్ధాన్‌లో వివిధ పేర్లతో పని చేస్తున్న సి.ఐ.ఏ సిబ్బందిలో మూడింట రెండో వంతు మందిని అమెరికాకి వెనక్కి పంపివేయడంతో అమెరికా పాకిస్ధాన్‌పై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. టెర్రరిస్టు వ్యతిరేక యుద్ధంలో తమ సైనికులు పాల్గొంటున్నందుకు గాను పాకిస్ధా‌న్‌కి అమెరికా విడుదల చేయవలసి ఉన్న 800 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైట్ హౌస్ సిబ్బంది ఉన్నతాధికారి  బిల్ డాలీ, ఎబిసి టెలివిజన్‌తో మాట్లాడుతూ “సహాయంలో కొంత భాగాన్ని నిలిపివేయడానికి దారి తీసేలా పాకిస్ధాన్ కొన్ని…

జులై 9న వెలసిన కొత్త దేశం, 196వ దేశంగా దక్షిణ సూడాన్

ప్రపంచ పటంలోకి మరొక కొత్త దేశం వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన రిఫరెండంలో దక్షిణ సూడాన్ ప్రజలు 90 శాతానికి పైగా కొత్త దేశాన్ని కోరుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తూ జులై 9, శనివారం తెల్లవారు ఝాము ప్రారంభ క్షణాల్లో దక్షిణ సూడాన్ ను ఏర్పాటు చేస్తూ ప్రకటన జారీ అయింది. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్, ఐక్య సూడాన్ అధ్యక్షుడు ఆల్-బషర్, 30 ఆఫ్రికా దేశాల ప్రతినిధుల సమక్షంలో…

సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొదటిసారి హిందూ మహాసముద్రంలోకి పేల్చి పరీక్షించిన ఇరాన్

ఈ సంవత్సరం ప్రారంభంలో తన సుదీర్ఘ లక్ష్య క్షిపణులను మొట్టమొదటిసారిగా హిందూ మహాసముద్రంలోకి పేల్చడం ద్వారా పరీక్షించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లొ ఈ ప్రకటన వెలువడింది. రెండు లాంగ్-రేంజ్ మిసైళ్ళను పరీక్షించినట్లు ఇరాన్ వెల్లడించింది. “బహమాన్ నెలలో (జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 వరకు) 1900 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఉత్తర ఇరాన్ లో గల సెమ్‌నాన్ రాష్ట్రం నుండి హిందు మహాసముద్రం ముఖద్వారం వద్దకు…

నాటో దాడులకు వ్యతిరేకంగా లిబియా ప్రజల అతి పెద్ద ప్రదర్శన -వీడియో

లిబియా ప్రజలు గడ్డాఫీని తిరస్కరిస్తున్నారనీ, గడ్డాఫి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారనీ గడ్దాఫీ ప్రభుత్వ బలగాలు లిబియా ప్రజలను చంపుతుంటే వారిని కాపాడ్డానికే తాము లిబియాపై బాంబులు మిసైళ్ళతో దాడులు చేస్తున్నామనీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాని నాటో దాడుల ఫలితంగా గడ్డాఫీని వ్యతిరేకిస్తున్న వారు సైతం తమ వ్యతిరేకతను పక్కన పెట్టి విదేశీ మూకల దాడులను దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. జులై 1 జరిగిన లిబియా ప్రజలు పాల్గొన్న అతి పెద్ద…

లిబియా ప్రజలకు ‘నాటో’ ప్రసాదించిన ప్రజాస్వామ్యం -కార్టూన్

గడ్డాఫీని కూలదోసి లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు అనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలు నడుం బిగించాయి. నాటో యుద్ధ విమానాలు లిబియాపై బాంబుదాడులు చేసి ప్రజలను చంపినా, అది వారిని కాపాడడానికే. గడ్డాఫీ బతికున్నంతవరకూ లిబియాను ఆయననుండి కాపాడ్డానికీ, లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి బాంబుదాడులు చేస్తూ ప్రజలు చంపుతూనే ఉంటాయట! కాని అది ప్రజలను గడ్డాఫీనుండి కాపాడ్డానికేనంటే నమ్మాలి మరి, తప్పదు! ఎందుకంటే చెప్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గనక. అమెరికా,…

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లకు ఇరాన్ ఆయుధాల సరఫరా -అమెరికా

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో అమెరికా సైనికులపై పోరాటం చేస్తున్న వారికి ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐ.ఆర్.జి.సి) ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్నదని అమెరికా శనివారం వెల్లడించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి అమెరికా సేనలు త్వరగా వెళ్ళిపోవడానికి ఇరాన్ ఈ విధంగా చేస్తున్నదని అమెరికా అధికారులు చెప్పారు. అయితే ఇరాన్ ఈ సమాచారాన్ని కొట్టిపారేసింది. అమెరికా సైనికులను సుదీర్ఘకాలం పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో కొనసాగించాలని, అమెరికా భావిస్తోంది. దానికోసమే ఇరాన్‌పై ఇలాంటి కధలు ప్రచారం…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవద్దు -అమెరికాని కోరిన భారత ప్రభుత్వం

ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతున్న నిత్య మారణహోమం భారత పాలకులకు దీపావళి లాగా కనిపిస్తున్నట్లుంది. కాకుంటే ఎక్కడినుండో ఏడేడు సముద్రాల ఆవలినుండి వచ్చిన అమెరికా, దాని తైనాతీ దేశాలు పొరుగు దేశాన్ని ఆక్రమించి బాంబుదాడులతో, సైనిక కాల్పుల్లో ఆఫ్ఘన్ ప్రజల ఉసురు తీస్తుంటే దాన్ని ఖండించి ఆఫ్ఘన్ ప్రజలకు సంఘీభావం ప్రకటించే బదులు దురాక్రమణ సైన్యాన్ని మరికొంత కాలం కొనసాగించాలని బ్రతిమాలుతుందా? బ్రిటిష్ వలసవాదులు, భారత ప్రజల పోరాటాలకు తలొగ్గి 1947లో దేశం విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించినప్పుడు ఏ చైనా,…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికి బ్రిటిష్ అధికారుల రహస్య ప్రయత్నాలు

బహుళజాతి కంపెనీలు, వారితో కుమ్మక్కైన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడానికి, వారికి సరైన సమాచారం అందకుండా చుడ్డానికి ఎంతకైనా తెగిస్తారు. అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు లేదా బ్రిటన్ కావచ్చు. ప్రజల భవిష్యత్తు నాశనమైపోయినా సరే వారికి మాత్రం లాభాలు నిరంతరాయంగా వస్తూ ఉండవలసిందే. ఫుకుషిమా దైచి అణు ప్రమాదం వలన కొత్తగా నెలకొల్పే న్యూక్లియర్ కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తారని భయపడిన బ్రిటిష్ అధీకారులు ఆ ప్రమాదం వలన ఏర్పడపోయే ప్రతికూల పరిణామాలను తక్కువ చేసి…

వన్‌డే, టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ఇండియా పర్యటించనున్న పాకిస్ధాన్

ముంబై టెర్రరిస్టు దాడులతో ఇండియా, పాకిస్ధాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలతో పాటు క్రికెట్ సంబంధాలను కూడా ఇండియా తెంచుకున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో తలపడిన దాయాదులు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రక్రియను క్రికెట్ దౌత్యంతో ప్రారంభించారు. ఇండియా ప్రధాని, ఇండియా, పాక్‌ల సెమీఫైనల్ మ్యాచ్ తిలకించడానికి పాక్ ప్రధానిని ఆహ్వానించగా ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ని ఆద్యంతం తిలకించి సంబంధాల మెరుగుదలకు తాము సిద్ధమని తెలిపాయి. జూన్ నెలలో…

రెండు యుద్ధాలు, మూడు ఫోటోలు, కొన్ని వాస్తవాలు

రెండు యుద్ధాలు అమెరికా, దాని మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, ఇటలీ మొదలైన నాటో సభ్య దేశాలు దశాబ్ద కాలంగా “టెర్రరిజంపై ప్రపంచ యుద్ద్యం” అని ఒక అందమైన పేరు పెట్టి, తాము జన్మనిచ్చి, పెంచి, పోషించిన సంస్ధలపైనే యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్‌ లపై దురాక్రమణ యుద్ధాలు సాగిస్తున్నాయి. పశ్చిమ దేశాలు అన్యాయంగా సాగిస్తున్న ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలే రెండు యుద్ధాలు. మూడు ఫోటోలు

అమెరికా యుద్ధాల ఖర్చు $3.7 ట్రిలియన్, చావులు 2.25 లక్షలు

అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ యుద్ధాల ఖర్చు 1 ట్రిలియన్ డాలర్లని ఒబామా బలగాల ఉపసంహరణ ప్రకటిస్తూ అన్నాడు. బలగాల ఉపసంహరణకు ఈ ఖర్చు కూడా ఒక కారణమని ఆయన చెప్పాడు. కాని ఒబామా చెప్పిన లెక్క పూర్తిగా తప్పు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన ‘వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్ధ అమెరికా సాగిస్తున్న యుద్ధ ఖర్చులపై అధ్యయనం చేసింది. 2001 నుండి అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, పాకిస్ధాన్ లలో సాగించిన యుద్ధాలకు ఖర్చయిన సొమ్ము, అన్ని…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…

అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం

అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…