ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు

ఈ ఇరానియన్ తల్లి, కూతుళ్ల దుఃఖానికి ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే వారు అనుభవిస్తున్న వేదన అంతా ఒక్క ముక్కలో అర్ధం అవుతుంది? పోనీ ఎన్ని పదాలు కలిపి ప్రయోగిస్తే వారి నిరామయ దుఃఖ సారం నిండుగా వ్యక్తీకరించబడుతుంది? ఎన్ని రాత్రుళ్లు, పగళ్ళు పొగిలి పొగిలి ఏడ్చితే తీరే దుఃఖం వీరిది! ఆమె పేరు సొమాయే మెహ్రి. వయసు 29. ఆమెతో ఉన్నది మూడేళ్ల కూతురు రానా. సొమాయే భర్త అమీర్ అఫ్ఘనిపూర్ అకృత్యానికి…

ఆ కుటుంబానికి ఇక వినోదం(దిని) దూరం

ఒక అమ్మాయి జీవితంలో సంతోషం నింప వలసిన ప్రేమ, కాలకూట విషాన్ని విరజిమ్మి చివరికి ఆ జీవితాన్నే బలిగొన్న విషాదాంతం ఇది. ‘ప్రేమ’ రూపంలో వ్యక్తమయిన ‘పురుష దురహంకారం’, వినోదిని తిరస్కారంతో అసలు రంగు వెల్లడించుకుని జడలు విప్పిన ఉన్మత్తంతో ‘యాసిడ్ దాడి’గా ప్రతీకారం తీర్చుకుంది. ఫలితంగా మూడు నెలల పాటు తీవ్ర శారీరక, మానసిక వేదన అనుభవించిన వినోదిని మంగళవారం శాశ్వతంగా కన్నుమూసింది. మెడ, కళ్ళు, చెవులు భాగాలను తీవ్రంగా కాల్చుకుతిన్న యాసిడ్ తన ప్రభావాన్ని…