ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు

జనవరి చివరి వారంలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గాజా ప్రాంతం పైకి హంతక దాడులు చేసి 150 మందికి పైగా పాలస్తీనీయులను బలిగొనడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధిస్తానని కలలు కన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశలు నెరవేరకపోగా గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోవడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఒక మాదిరి మలుపు తిరిగాయి. కొత్తగా ఏర్పడిన రెండు సెంట్రిస్టు పార్టీలు అనూహ్య రీతిలో 31 స్ధానాలు గెలుచుకోవడంతో నెతన్యాహు…