ఇజ్రాయెల్ ఘాతుకం: హమాస్ నేత హనియే హత్య!
ఇజ్రాయెల్ మరో ఘాతుకానికి తెగబడింది. హమాస్ సంస్థ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం ప్రారంభోత్సవం నిమిత్తం ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఉండగా ఇస్మాయిల్ హనియే బస చేస్తున్న భవనంపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో హనియే మరణించినట్లు వివిధ వార్తా సంస్థలు తెలియజేశాయి. జులై 31 ఉదయం జరిగిన ఈ హత్యలో, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన పాత్ర పోషించినట్లు…
