అమాయకులు కాదు, కాంగీ నాయకులే లక్ష్యం -మావోయిస్టులు
మహేంద్ర కర్మ, తదితరుల కాంగ్రెస్ పార్టీ నాయకులే తమ మెరుపుదాడికి లక్ష్యం అని మావోయిస్టులు ప్రకటించారు. తమ దాడిలో మరణించిన అమాయకులకు వారు క్షమాపణలు తెలిపారు. సల్వాజుడుం ద్వారా గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన మహేంద్ర కర్మ, ఇతర కాంగ్రెస్ నాయకులపై గిరిజనుల తరపున ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన మావోయిస్టులు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్, గెరిల్లా ఆర్మీ మరియు మిలీషియా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఉసెండి…